కన్నడ స్టార్ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది చివర్లో ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడం తెలిసిందే. ఆయన మృతి చెంది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పునీత్ మృతి చెందాడంటే ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా వుంటే పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం `జేమ్స్` ఆయన పుట్టిన రోజైన మార్చి 17న విడుదలైంది. అప్పూ చివరి చిత్రం కాడంతో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.
కన్నడ మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీని అత్యథిక థియేటర్లలో విడుదల చేశారు. అంతే కాకుండా ఈ మూవీ రిలీజ్ సందర్‌భంగా కర్ణాటక ఇండస్ట్రీ వర్గాలు , ఎగ్జిబిటర్స్ ఈ మూవీ విడుదలైన మార్చి 17 నుంచి 22 వరకు మరే సినిమా ని విడుదల చేయకూడదని, పూర్తిగా `జేమ్స్` సినిమానే అన్ని థియేటర్లలోనూ ప్రదర్శించాలని తీర్మాణం చేసుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ మూవీని మార్చి 17 నుంచి కర్ణాటకలోని దాదాపు అన్ని థియేటర్లలో ప్రదర్శిస్తూ అప్పూపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.
పునీత్ నటించిన చివరి చిత్రం కావడంతో `జేమ్స్` ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద జాతర వాతావరణం కనిపించింది. కొన్ని థియేటర్లయితే అభిమానుల కన్నీటి వరదతో తడిసి ముద్దయ్యాయి కూడా. అభిమాన హీరోని కడసారి వెండితెరపై చూస్తూ అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో కర్ణాగకలోని చాలా వరకు థియేటర్లన్నీ అభిమానులు శోకాలతో దద్దరిల్లాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారి ఎంత మందిని భావోద్వేగానికి లోనయ్యేలా చేశాయి.
ఇదిలా వుంటే ఈ మూవీ విడుదలై నేటికి అంటే మార్చి 24కు వారం రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కొన్ని థియేటర్లలో జనం తగ్గారు. దీంతో ఆయా థియేటర్లలో సినిమాని తీసేయాలని థియేటర్ల యాజమాన్యం యోచిస్తోంది. ఈ మూవీని తొలగించి అత్యధిక థియేటర్లలో ట్రిపుల్ ఆర్ ని ప్రదర్శించబోతున్నారు. ట్రిపుల్ ఆర్ ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. కర్నటకలో ఈ మూవీని అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ తెలుగు వెర్షన్ ని అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారని, కన్నడ వెర్షన్ ని తక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నారని కర్ణాటకలో వివాదం మొదలైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో `జేమ్స్` చిత్రాన్ని చాలా వరకు థియేటర్లలో నుంచి తొలగించబోతుండటంతో దీన్ని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని అభిమానులు, రాజకీయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం ఇప్పుడు కన్నడ నాట సంచలనంగా మారింది. వేరే సినిమాలకు తాము వ్యతిరేకం కాదని, కానీ వేరే సినిమాల కోసం మా హీరో చిత్రాన్ని బలి చేయడం తగదని తీవ్రంగా హెచ్చిరిస్తున్నారట. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయాన్ని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వక్తం చేస్తున్నారట.