కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది గుండెపోటు కారణంగా హఠాత్తుగా మృతి చెందారు. దీంతో కోట్లాది అభిమానులు ఒక్క సారిగా షాక్ లోకి వెళ్లిపోయారు. అభిమాన హీరో ఇలా అర్థ్రాంతరంగా మృతి చెందండం అభిమానుల్ని తీవ్రంగా కలిచి వేసింది. దీంతో వేల మంది రోడ్డెక్కారు. పునీత్ కు నివాళులు అర్పించేందుకు కనీ వినీ ఎరుగని స్థాయిలో ఆయన పార్టీవ దేహాన్ని చేరుకుని ఘనంగా కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ తరహా సెండాఫ్ రాజకీయ నాయకులకు, పేరున్న వారికి తప్ప మరెవరికి లభించదు.
కానీ సినీనిమా స్టార్.. అందులోనూ యంగ్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ కు దక్కడం, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పునీత్ పార్టీవ దేహాం నుదిటిపై ముద్దు పెట్టి కన్నీటి పర్యంతం కావడం అత్యతం అరుదైన విషయం. కన్నడ నాట సినిమా హీరో గానే కాకుండా ఓ సామాజిక కార్యకర్తగా పునీత్ చేసిన సేవలు కన్నడీగులకు తప్ప బాహ్య ప్రపంచానికి తెలియదు. ఆయన మరణంతో అవన్నీ బయటికి వచ్చి బాహ్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఒక వ్యక్తి ఇంత మందికి ఇన్ని రకాలుగా సహాయం చేశాడా? .. సినిమాల్లో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న స్టార్ సామాజిక కార్యక్రమాలతో ఇన్ని కోట్ల మంది హృదయాల్లో దేవుడిగా నిలిచాడా? అని అంతా అవాక్కయ్యారు.
చాలా మంది పునీత్ గురించి తెలియని వాళ్లు.. ఆయన సినిమాలు ఇంత వరకు చూడని వాళ్లు కూడా పునీత్ గురించి నెట్టింట సెర్చ్ చేయడం విశేషం. అసాధ్యమనుకున్న పనుల్ని కూడా సుసాధ్యం చేసి ఇతరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపి దేవుడయ్యారు పునీత్ రాజ్ కుమార్. అలాంటి వ్యక్తి హఠాత్తుగా చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం గత కొన్ని రోజులుగా కన్నడీగులు తట్టుకోలేకపోతున్నారు. పైగా మార్చి 17 గురువారం పునీత్ రాజ్ కుమార్ మరణానంతరం జరుపుతున్న తొలి జయంతి కావడం.. ఇదే రోజు సునీత్ నటించిన చివరి చిత్రం `జేమ్స్`ని విడుదల చేయడంతో కర్ణాటకలోని థియేటర్లన్నీ అభిమానుల కన్నీటి వరదతో తడిసి ముద్దవుతున్నాయి.
పునీత్ చివరి చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు. దాదాపు 4000 వేల స్క్రీన్ లలో ఈ మూవీని ప్రదర్శిస్తున్నారు. ఈ మూవీని ఈ నెల 22 వరకు ఇలాగే ప్రదర్శించాలని, ఆ తరువాతే మిగతా చిత్రాలని విడుదల చేయాలని కర్ణాటక ఇండస్ట్రీ వర్గాలు ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి ఎగ్జిబిటర్లు, డిస్ట్రీ బ్యూటర్లు నుంచి పూర్తి మద్దతు లభించింది. దీంతో ప్రస్తుతం కర్ణకటలోని అత్యధిక థియేటర్లలో పునీత్ `జేమ్స్ ` చిత్రం మాత్రమే ప్రదర్శింపబడుతోంది.
అభిమాన హీరో చనిపోవడం, ఆయన నటించిన చివరి చిత్రం థియేటర్లలో ప్రదర్శింపబడుతుండటంతో పునీత్ అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్లలకు చేరుకుంటున్నారట. వెండితెరపై చివరి సారి తమ ఆరాధ్య నటుడిని చూసి కన్నీరు మున్నీరవుతున్నారట. థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తున్నా.. అభిమానుల్లో మాత్రం కన్నీరు కట్టులు తెంచుకుంటోందట. గురువారం తెల్లవారు జాము నుంచే షోలు ప్రారంభించేశారు. సినిమా అయిపోగానే బయటికి వస్తున్న అభిమానులు బోరున విలపిస్తూ కనిసిస్తున్నారట. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.