సినిమాకి ఇలా అయితే ఎలా వెళ్ల‌గ‌లం?

Update: 2022-03-03 03:34 GMT
జ‌గ‌న్ అన్న‌ను అంటున్నారు కానీ...! ఈ సినీగోయ‌ర్ క‌ల‌త‌ను కాస్త‌యినా చూస్తున్నారా?  రూ.295 పెట్టి టిక్కెట్టు కొని సినిమా ఎలా చూడ‌గ‌ల‌ను? అంటూ ప్ర‌శ్నిస్తున్నాడు. `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` టిక్కెట్టు ధ‌ర ఇది.. అంటూ తెలిపాడు అత‌డు. కాస్త‌యినా నిర్మాత‌లు బ్యాలెన్స్ చేయాలి క‌దా? అని కూడా అడిగాడు. కొన్ని మల్టీప్లెక్సులు ఇలా బాదేస్తున్నాయ‌ని కూడా నివేదించాడు. సినిమాకి ఇలా అయితే ఎలా వెళ్ల‌గ‌లం? అని ప్ర‌శ్నించాడు. స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలోనే జ‌గ‌న్ అన్న గుర్తుకొస్తారు కానీ! అంటూ దీనిపై కొంద‌రి సెటైర్లు ప‌డుతున్నాయి.

అయితే అతివృష్టి అనావృష్టి  లాగా తెలంగాణ‌లో మ‌రీ విప‌రీతంగా టికెట్ పై బాదేస్తుంటే.. అటు ఏపీలో రూ.10 కి టికెట్ అమ్ముతున్నారు. ఇటూ అటూ కూడా ఆడుకుంటున్నార‌ని ప్రేక్ష‌కులు విరుచుకుప‌డుతున్నారు. కార‌ణం ఏదైనా ఈ అతివృష్టి అనావృష్టి టాలీవుడ్ కి ప్ర‌మాద‌క‌రంగా మారింద‌ని విశ్లేషిస్తున్నారు.

నిజానికి టికెట్ కి సుమారు రూ.300 పెట్ట‌డం అంటే మాట‌లా? ఇంత పెద్ద మొత్తం పెట్టి అల్పాదాయ వ‌ర్గాలు సినిమాలు చూడ‌గ‌ల‌వా? అన్న‌ది ఎప్పుడూ బిలియ‌న్ డాల‌ర్ క్వ‌శ్చ‌న్ మార్క్. వినోదానికి చాలా కుటుంబాలు దూరంగా ఉండిపోవ‌డానికి థియేట‌ర్ల‌కు కదిలి వెళ్ల‌క‌పోవ‌డానికి ఇలాంటి అత్యాశే ఒక ప్ర‌ధాన కార‌ణం.

సినిమా టికెట్ భారం విష‌యంలో బ్యాలెన్స్ అన్న‌ది లేక‌పోవ‌డం వ‌ల్ల మ‌ధ్య‌త‌ర‌గ‌తి పేద త‌ర‌గ‌తులు సినిమాకి దూర‌మైపోతున్నాయ‌న్న వాస్త‌వాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. ముఖ్యంగా కుటుంబ స‌మేతంగా క‌లిసి సినిమా చూడ‌డం అన్న‌ది చాలా పేద కుటుంబాల్లో లేదు ఇటీవ‌లి కాలంలో. నిజానికి ఉప్పు ప‌ప్పు కూర‌గాయ‌లు ఇత‌ర‌త్రా నిత్యావ‌స‌ర సామాగ్రి ధ‌ర‌లే మంట పెట్టేస్తుంటే వాట‌న్నిటినీ కాద‌ని సినిమా చూసే స‌న్నివేశం కూడా లేదు.

యూత్ ఆద‌ర‌ణ‌.. మాస్ జ‌నం థియేట‌ర్ల‌కు వెళుతుండ‌డం వ‌ల‌న ఆమాత్రం అయినా సినిమాలు ఆడుతున్నాయి. లేదంటే ఇప్పుడున్న‌ థియేట‌ర్లు అన్నీ క‌ళ్యాణ మంట‌పాలుగా ఎప్పుడో మారిపోయేవి. అయితే స‌ద‌రు ప్రేక్ష‌కుడు టిక్కెట్టును బ్యాలెన్స్ చేయ‌మ‌ని మాత్ర‌మే అడిగాడు. క‌నీసం రూ.150-175 మ‌ధ్య ఉంటే అందుబాటులో ఉంటుందేమో.. దానికి డ‌బుల్ వ‌సూలు చేయ‌డం అంటే మ‌ల్టీప్లెక్సులు కూడా ఆలోచించాలి.

ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రూ.10  .. రూ.20 టిక్కెట్లు అమ్మ‌డం కూడా విడ్డూరం. ఇలాంటి అతి చాలా ప్ర‌మాద‌క‌రం అని ఇప్ప‌టికే ప‌రిశ్ర‌మ వ‌ర్గాలంతా తిట్టుకోవ‌డం క‌నిపిస్తోంది.
Tags:    

Similar News