ప్రచారార్భాటంతో అక్కడేదో ఉందని అమాయక జనాల్ని భ్రమింప జేయడం.. ఆనక థియేటర్లకు వెళితే నీరసం వచ్చేలా బోరింగ్ సినిమా చూపించడం.. ఇదీ కొందరి తీరు. యూట్యూబ్ వీడియోకి ఎక్కువ.. బూతు లఘు చిత్రానికి తక్కువ! అనిపించే సినిమాలు తీసి జనాల నెత్తిన రుద్దేయడం ఇటీవల మరింత పెరిగిందే కానీ తగ్గలేదు.
ఈ గురువారం రిలీజైన ఓ డీగ్రేడ్ సినిమా తంతు అలానే ఉందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా థియేటర్లకు వెళ్లిన జనాలు పచ్చి బూతు సినిమా అంటూ తిట్టేస్తూనే అసలు ఇది సినిమానా? మరీ ఇంత దారుణమా? అని తిట్టుకోవడం మీడియా కంట పడింది. ఎరోటిక్ థ్రిల్లర్.. పేరుతో భరితెగింపుడు కథల్ని ఎంచుకుని సినిమాలు తీస్తారా? అంటూ జనాల నోట బూతుల పంచాంగం వినిపిస్తోంది.
ఇక్కడో ట్విస్టు ఏమంటే.. సదరు డీగ్రేడ్ సినిమా కేవలం రెండు మూడు రోజులు ఆడితే పెట్టిన పెట్టుబడి తిరిగి నిర్మాత చేతికి వచ్చేస్తుందట. అంత తక్కువ బడ్జెట్ తో పరమ చెత్తగా నాశి రకంగా తీశారు. కనీస వీడియో క్వాలిటీ లేక జనం ఇదేం సినిమా అంటూ తిట్టేస్తున్నారు. ఇక ఇండస్ట్రీ బాకా భజన బాబులు ఈ సినిమా ఇలా రిలీజైందో లేదో.. అలా మార్నింగ్ షోస్ ఫుల్స్ అంటూ భజన మొదలెట్టేశారు. అంతేకాదు ఆ నిర్మాతకు అభివందనలు.. శుభాకాంక్షలు అంటూ పొగిడేశారు. ``ఈ మధ్య కాలంలో ఇంత ఓపెనింగ్స్ లేనే లేవు. ఇన్ని థియేటర్స్ రిలీజ్ చేయడం కూడా గ్రేట్. మంచి ఓపెనింగ్స్ తెచ్చింది.. టాక్ మాత్రం పరమ డివైడ్ గా నడుస్తోంది. అయినా బయ్యర్స్ సేఫ్ అవుతారు. కలెక్షన్స్ నిలబడితే ప్రాఫిట్స్ లోకి కూడా వెళతారు!!`` అంటూ ప్రచారం సాగిపోతోంది. అంతేకాదు.. మార్నింగ్ షో ఫుల్ చేయడం నిర్మాత బాధ్యత .. మ్యాట్నీ ఫుల్ చేయడం దర్శకుడి బాధ్యత.. ఫస్ట్ షో ఫుల్ చేయడం సినిమా బాధ్యత!! అంటూ మరో గట్టి స్లోగన్ ని వదిలారు మరి. ప్చ్.. ప్రచారార్భాటంతో ఇలాంటి డీగ్రేడ్ చిత్రాల్ని హిట్ చేయడం ఇదేం ట్రెండ్ బాబోయ్ అంటూ నెత్తి నోరు బాదుకుంటున్నారు కొందరైతే!!