భ‌గ‌భ‌గ మండే ఎండ‌లో నేచుర‌ల్ స్టార్ చిందులు

Update: 2022-04-11 08:49 GMT
గ‌త ఏడాది వ‌రుస‌గా రెండు సూప‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకున్న క్రేజీ హీరో నేచుర‌ల్ స్టార్ నాని ఈ ఏడాది కూడా మ‌రో రెండు క్రేజీ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న యంగ్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ‌తో చేస్తున్న రొమాంటిక్ కామెడీ డ్రామా 'అంటే సుంద‌రానికి' చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. మ‌రో మూవీని హీరో నాని కొత్త ద‌ర్శ‌కుడితో ఇటీవ‌లే ప్రారంభించారు. 'ద‌స‌రా' పేరుతో రూపొందుతున్న మాసీవ్ యాక్ష‌న్ డ్రామా ఇది. ఈ చిత్రం ద్వారా శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు.

శ్రీ‌ల‌క్ష్మీ వెంకటేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్ పై యువ నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. 'నేను లోక‌ల్' వంటి స‌క్సెస్ ఫుల్ మూవీ త‌రువాత నాని, కీర్తి సురేష్ క‌లిసి న‌టిస్తున్న సినిమా ఇది. తెలంగాణ క‌రీంన‌గ‌ర్ జిల్లా స‌మీపంలోని పెద్ద ప‌ల్లి జిల్లాలోని గోదావరిఖ‌ని నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కోల్ మైన్స్ లో ప‌ని చేసే వ్య‌క్తిగా మాసీవ్ పాత్ర‌లో హీరో నాని క‌నిపిస్తున్నారు.

హీరో నాని న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెలుగులో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయ‌బోతున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ పెద్ద ప‌ల్లి జిల్లాలోని గోదావ‌రి ఖ‌నిలో జ‌రుగుతోంది. హీరో నానిచ కీర్తి సురేష్ పాల్గొన‌గా ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్ ర‌క్షిత్ నేతృత్వంలో ఓ భారీ సెట‌ప్ తో ఓ పాట‌ని చిత్రీక‌రిస్తున్నారు. ఇటీవ‌ల 'ట్రిపుల్ ఆర్‌' కోసం ప్రేమ్ ర‌క్షిత్ కొరియోగ్రఫీ అందించిన 'నాటు నాటు ' సాంగ్ పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే.

బొగ్గుగ‌ని నేప‌థ్యంలో చిత్రీక‌రిస్తున్న ఈ పాట కోసం టీమ్ అంతా చాలా శ్ర‌మిస్తోంద‌ట‌. కార‌ణం అస‌లే ఎండాకాలం.. పైగా బొగ్గు గ‌ని ప‌రిస‌రాల్లో సాంగ్ అంటే మామూలు విష‌యం కాదు.. బ‌య‌టి టెంప‌రేచ‌ర్ కి మించి అక్క‌డ వేడి వుంటుంది. అలాంటి వాతావ‌ర‌ణంలో ప్ర‌స్తుతం 'ద‌స‌రా' చిత్రం కోసం నాని, కీర్తి సురేష్ ల‌పై ఓ భారీ సాంగ్ ని ప్రేమ్ ర‌క్షిత్ తెర‌కెక్కిస్తున్నారు. భారీ గ్రాండ్ స్కేల్ లో చిత్రీక‌రిస్తున్న ఈ పాట లో 500 డాన్స‌ర్ లు పాల్గొంటున్నారు. దీంతో ఈ సాంగ్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. నాని న‌టించిన చిత్రాల‌లో ఇంత వ‌ర‌కు ఈ రేంజ్ లో డాన్స‌ర్ ల‌ని ఉప‌యోగించ‌క‌పోవ‌డంతో ఈ పాట సినిమాకు ప్ర‌త్యేక హైలైట్ గా నిలుస్తుంద‌ని చెబుతున్నారు.

ఇటీవ‌ల 'స్పార్క్ ఆఫ్ ద‌స‌రా' పేరుతో విడుద‌ల చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్ సినిమాపై ఇప్ప‌టికే అంచ‌నాల్ని పెంచేసింది. నాని గ‌ల్ల‌లుండీ క‌ట్టుకుని బ‌న్నీ'పుష్ప‌' త‌ర‌హా మాసీవ్ గెట‌ప్ లో క‌నిపించ‌డంతో ఫ‌స్ట్ గ్లింప్స్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ ల‌భించింది. సింగ‌రేణి కోల్ మైన్స్ నేప‌థ్యంలో సాగే ఈ మూవీలో నాని పాత్ర మాసీవ్ గా సాగుతూనే చాలా ప‌వర్ ఫుల్ గా వుంటుంద‌ని తెలుస్తోంది. మాసీవ్ యాక్ష‌న్ ప్యాక్డ్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో వ‌హీదా రెహ‌మాన్‌, స‌ముద్ర‌ఖ‌ని, సాయి కుమార్‌, రోష‌న్ మాథ్యూ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయ‌ణ‌న్‌, ఫొటోగ్ర‌ఫీ స‌త్య‌న్ సూర్య‌న్‌, ఎడిటింగ్ న‌వీన్ నూలి.
Tags:    

Similar News