స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు `ఉప్పెన` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవడమే కాకుండా తొలి చిత్రంతో ఇండస్ట్రీలో వున్న బిగ్ స్టార్స్ దృష్టిలో పడ్డారు. దీంతో అతనికి స్టార్ హీరోల నుంచి, స్టార్ ప్రొడక్షన్ కంపనీల నుంచి వరుసగా భారీ ఆఫర్లు వచ్చాయి. అంతకు ముందే మైత్రీ మూవీమేకర్స్ సంస్థ `ఉప్పెన` టైమ్ లోనే మరో సినిమాకు ఒప్పందం కుదుర్చుకుందట. దీంతో స్టార్ ల నుంచి వచ్చిన ఆఫర్లని దర్శకుడు సానా బుచ్చిబాబు సున్నితంగా తిరస్కరించి ఎన్టీఆర్ తోనే తన తదుపరి ప్రాజెక్ట్ అని చెప్పేశారట.
అప్పటి నుంచి ఎన్టీఆర్ కోసమే ఎదురుచూస్తున్న సానా బుచ్చిబాబుకు తాఆజగా కొత్త చిక్కులు వచ్చిపడినట్టుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు మూడున్నరేళ్లుగా `ట్రిపుల్ ఆర్` కే కేటాయించారు. తాజాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఎట్టకేలకు ఫ్రీ అయిపోయారు. ట్రిపుల్ ఆర్ నుంచి రిలీఫ్ అయిన ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30 వ చిత్రానికి రెడీ అయిపోతున్నారు. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.
భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ మూవీ కోసం హీరోయిన్ గా ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ని మేకర్స్ ఫైనల్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ అలియా భట్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా బయటపెట్టింది కూడా. త్వరలోనే ఈ మూవీని పట్టాలెక్కించబోతున్నారు. జూన్ నుంచి ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత తన చిత్రాన్ని పట్టాలెక్కించాలని ఎదురుచూస్తున్న సానా బుచ్చిబాబుకు కొత్త చిక్కుల వచ్చిపడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ తో సానా బుచ్చి బాబు ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. 1980 నేపథ్యంలో సాగే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి `పెద్ది` అనే టైటిల్ ని కూడా ఫైనల్ చేసిన దర్శకుడు ఓ విషయంలో ఇబ్బందులు పడుతున్నారట. కారణం ఈ ప్రాజెక్ట్ పై ఎన్టీఆర్ ఆలోచన మారడమేనని తెలుస్తోంది. సినిమాలోని ఓ కీలక ఘట్టంలో హీరో ఎన్టీఆర్ దివ్యాంగుడిగా కనిపించాలట. అది కథకు చాలా కీలకం. కానీ అలా కనిపిస్తే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఎన్టీఆర్ అనుమానం.
ఈ విషయంలో ఎన్టీఆర్ పునరాలోచనలో పడ్డారని, అయితే సినిమాని పక్కన పెట్టాలనే ఆలోచనలో తను లేడని చెబుతున్నారు. `ఉప్పెన` విషయంలోనూ దర్శకుడు సానా బుచ్చిబాబు ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొన్నారట. `ఉప్పెన` క్లైమాక్స్ చాలా మందిని షాక్ కు గురిచేసింది. అయితే ఆ క్లైమాక్స్ ని మార్చేయమని చాలా మంది బుచ్చిబాబుపై ఒత్తిడి తీసుకొచ్చారట. కానీ బుచ్చిబాబు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ క్లైమాక్స్ ని మార్చనని పట్టబట్టడంతో మేకర్స్ అదే క్లైమాక్స్ తో సినిమాని రిలీజ్ చేశారు. ఆ తరువాత అదే సినిమాకు ప్రధాన యుఎస్ పీగా మారి సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబెట్టింది. ఇప్పడు ఎన్టీఆర్ సినిమా విషయంలోనూ అలాంటి ఓ పాయింగ్ సినిమా ఆలస్యానికి కారణంగా నిలుస్తోందని చెబుతున్నారు.
అయితే దర్శకుడు మాత్రం ఆ పాయింట్ సినిమాకు కీలకం కావడంతో ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటున్నారట. మరి ఈ విషయంలో ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారు? .. ఎలా ముందుకు వెళతారన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఇమేజ్ ని పక్కన పెట్టి ఎన్టీఆర్ ఈ మూవీని ముందుకు తీసుకెళతారా? లేక ఇమేజ్ కోసం ఈ ప్రాజెక్ట్ ని వదులుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే.