అందాల రాక్షసి అంటూ అరంగేట్రం చేసిన లావణ్య త్రిపాఠిని టాలీవుడ్ బాగానే ఆదరిస్తోంది. వరుసగా సినిమాలే కాదు హిట్లు కూడా ఈమె ఖాతాలో పడుతున్నాయి. ఈ ఏడాది మిస్టర్ రిజల్ట్ తో కాసింత నిరుత్సాహపడ్డా అమ్మడి చేతిలో ఇంకా మంచి ప్రాజెక్టులు ఉండడంతో పెద్దగా దిగాలు పడలేదు.
లావణ్య త్రిపాఠి ఓ శాండల్ వుడ్ ప్రాజెక్టుకు ఒప్పుకుందంటూ కొన్ని రోజులుగా తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. కిచ్చా సుదీప్.. శివరాజ్ కుమార్.. అమీ జాక్సన్ లు నటించనున్న 'ది విలన్' మూవీలో లావణ్యకు కూడా చోటు దక్కిందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. ఇవి ఎంతకీ తగ్గకపోవడంతో.. ఇక ట్విట్టర్ సాక్షిగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది అందాల రాక్షసి. తాను ది విలన్ ప్రాజెక్టులో భాగం కాదని.. ఆ సినిమాలో నటించడం లేదని అఫీషియల్ గా తేల్చేసింది లావణ్య త్రిపాఠి.
యంగ్ హీరోలను వరుసగా కవర్ చేసేస్తున్న ఈ భామ ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతున్న ఓ మూవీలో నటిస్తోంది. చైతు హీరోగా కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న లావణ్య త్రిపాఠి.. తన కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఇది ఒకటిగా నిలుస్తుందని అంటోంది. మరోవైవు మాయావన్ మూవీలో కూడా నటించేస్తోంది లావణ్య. ఈ రెండు ప్రాజెక్టులు రిలీజ్ అయ్యాకే కొత్త సినిమాలకు సైన్ చేసే యోచనలో ఉన్నట్లు టాక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/