ఫోటో స్టొరీ: వెంకటలక్ష్మి ఈజ్ ఇన్ బికినీ

Update: 2019-02-23 08:59 GMT
రాయ్ లక్ష్మి అంటేనే హాట్నెస్ కు కేరాఫ్ అడ్రస్. తమిళంలో.. కన్నడలో ఆమెకు హీరోయిన్ ఇమేజ్ ఉంది కానీ తెలుగుకు వస్తే ఆమెను ఐటెం భామగా..  రత్తాలుగా చూస్తారు ప్రేక్షకులు.  ఈ బ్యూటీకి సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో ఎలా నెటిజనుల అటెన్షన్ రాబట్టుకోవాలో చక్కగా తెలుసు.  ఈ విషయంలో అసలు కాంప్రమైజ్ కాదు.

రీసెంట్ గా ఒక బీచ్ దగ్గర సెల్ఫీని తీసుకొని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  ఆ ఫోటోకు "బీచ్ గర్ల్ #సన్ కిస్డ్"  అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  బీచ్ లో ఉన్న గర్లు కాబట్టి 'బీచ్ గర్ల్'.  సూర్యుని కిరణాలు వచ్చి ఈ భామ అందాలను చురచురమని కాకుండా సుతారంగా.. సుతిమెత్తగా తాకుతున్నాయి కాబట్టి 'సన్ కిస్డ్' అనే పదాన్ని వాడింది. అసలు ఫోటో ఎలా ఉంది అంటే.. రాయ్ లక్ష్మి కనుక "సెక్సీ సెల్ఫీలు ఎలా తీసుకోవాలి?" అనే కోర్సు పెడితే నార్త్ సౌత్ తేడా లేకుండా బ్యూటీలందరూ వచ్చి కోర్సులో చేరిపోతారు.  అంత పర్ఫెక్ట్ గా తీసుకుంది సెల్ఫీ.

మీకు ఈ 'కోర్సు' అతిశయోక్తిగా అనిపిస్తుందేమో గానీ అది నిజమే.   ఎందుకంటే సహజంగా ఫోటో షూట్లు చేసేవారందరూ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు.. అలాంటప్పుడు ఫోటోలు బాగానే ఉంటాయి. కానీ సెల్ఫీలు అలా కాదు కదా.  మనకు మనమే తీసుకోవాలి. ఫోటో తీయడంలో ఏం తేడా జరిగినా అది తెలిసిపోతుంది.  

కానీ మీరు ఈ సెల్ఫిని గమనిస్తే  రాయ్ లక్ష్మి ఒక ప్రొఫెషనల్ లాగా తీసింది. ఒంపు సొంపులను కరెక్ట్ యాంగిల్ లో క్యాప్చర్ చేయడం.. మాంచి స్మైల్ ఇవ్వడం.. వీటన్నిటికి తోడుగా తన గాగుల్స్ లో తన ఫోన్ అసలు కనపడనీకుండా మరోవైపు నుండి తీసింది.   సముద్రపు అందాలు .. సూర్యుడు తన గాగుల్స్ లో సీనరీలాగా ఉండేలా సెల్ఫీ తీసింది.  సెల్ఫీ అంటే.. మూతి వైపు కెమెరా తిప్పి క్లిక్ కొట్టి.. దాన్ని ఎత్తి సోషల్ మీడియాలో పడేసి జనాలను చంపే సూర్యకాంతాలు.. శూర్పణఖలు రత్తాలును చూసి సెల్ఫీలు ఎలా తీసుకోవాలో నేర్చుకోవాలి!
Tags:    

Similar News