అనుపమ పరమేశ్వరన్.. పేరు వినగానే సో క్యూట్ లవ్ లీ బ్యూటీ అంటూ కితాబిచ్చేస్తుంది తెలుగు యూత్. అంతగా మన లోగిళ్లలో ప్రేమాభిమానాలు సంపాదించుకుంది ఈ మల్లూ బ్యూటీ. ఈ భామ నటించిన తొలి చిత్రం 'ప్రేమమ్' 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
రొమాంటిక్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన 'ప్రేమమ్' 29 మే 2015న థియేటర్లలో విడుదలైంది. తన తొలి చిత్రం 7 సంవత్సరాల జ్ఞాపకార్థం అనుపమ పరమేశ్వరన్ ఇన్ స్టాలో భావోద్వేగ పోస్ట్ ను షేర్ చేసింది. రొమాంటిక్ డ్రామా ప్రేమమ్ నుండి కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. దీనికి ''7 సంవత్సరాల ప్రేమమ్'' అని క్యాప్షన్ ఇచ్చింది. అల్ఫోన్స్ పుత్రేన్ రచన - దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివిన్ పౌళి -సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించారు. అనుపమ పాత్ర ఆసక్తికరం. ఈ ప్రాజెక్ట్ లో మడోన్నా సెబాస్టియన్- శబరీష్ వర్మ- కృష్ణ శంకర్- అనంత్ నాగ్- సిజు విల్సన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ప్రేమమ్ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ సాధించడమే గాక ఎన్నో ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రం జార్జ్ అతని స్నేహితుల బాల్యం నుండి యుక్తవయస్సు వరకు వారి జీవితాలకు సంబంధించిన కథ. అతని మొదటి ప్రేమ చాలా విఫలమైనప్పుడు.. కాలేజీ లెక్చరర్ అయిన మలార్ తో ప్రేమలో పడినప్పుడు.
అతని శృంగార ప్రయాణం అతన్ని అనేక దశలలోకి మలుపులు తిప్పుతుంది. ఈ ప్రాసెస్ అతని జీవిత లక్ష్యాన్ని కనుగొనడంలో అతనికి సహాయం చేస్తుంది. ప్రేమమ్ తర్వాత అడపాదడపా బ్లాక్ బస్టర్లలో నటించినా కానీ తనకు ఎప్పటికీ మర్చిపోలేనంత గొప్ప అనుభూతులను మిగిల్చిన ఏకైక చిత్రం ప్రేమమ్. అందుకే అనుపమ ఏడేళ్ల తర్వాత ఎంతో ఉద్వేగానికి లోనవుతోంది.
అనుపమ పరమేశ్వరన్ తదుపరి రొమాంటిక్ డ్రామా '18 పేజీస్' పై భారీ అంచనాలున్నాయి. ఇందులో నిఖిల్ సరసన కనిపించనుంది. ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 18న విడుదల కావాల్సి ఉండగా COVID-19 మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. బన్నీ వాస్ GA 2 పిక్చర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 18 పేజీస్ కు సుకుమార్ స్క్రిప్ట్ రాశారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గోపి సుందర్ స్వరాలు సమకుర్చారు.
'కార్తికేయ 2'లో నిఖిల్ తో కలిసి అనుపమ పరమేశ్వరన్ స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. మిస్టరీ థ్రిల్లర్ ని చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. తాజా సీక్వెల్ లో స్వాతి రెడ్డి- రావు రమేష్- తనికెళ్ల భరణి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.