నా కామెంట్‌ అర్థం కాక కేసు నమోదు చేశారంటోంది

Update: 2020-08-19 16:00 GMT
హీరోయిన్‌ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి కొంత కాలానికే ఫేడ్‌ ఔట్‌ అయిన హీరోయిన్‌ మాధవిలత. ఈమె మళ్లీ ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా కనిపిస్తోంది. బీజేపీ కండువ కప్పుకున్న తర్వాత ఈమె రెగ్యులర్‌ గా మీడియాలో కనిపిస్తూ వస్తుంది. సోషల్‌ మీడియాలో ఈమె పలు అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. ఈమెపై కొందరు నెటిజన్స్‌ బ్యాడ్‌ కామెంట్స్‌ చేయడం వాటికి ఆమె సమాధానం ఇవ్వడం చాలా కామన్‌ గా జరుగుతూనే ఉంది. తాజాగా ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది అంటూ కేసు నమోదు అయిన విషయం తెల్సిందే.

వనస్థలిపురంకు చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి కేసు పెట్టడం జరిగింది. హిందువులను కించ పర్చే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు. సోషల్‌ మీడియాలో ఆమె కామెంట్స్‌ చేసింది కనుక ఈ కేసు సైబర్‌ క్రైమ్‌ గా నమోదు అయ్యింది. తన వ్యాఖ్యలపై మాధవిలత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అసలు తాను స్వయంగా ఆ వ్యాఖ్యలు చేయలేదు అని ఒక నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాను అంది.

ఒక పోస్ట్‌ లో ముస్లీం సోదరుడు ఒకరు మోడీ గారు ప్రతి ముస్లీం ను ఉగ్రవాదిగా పరిగణిస్తారు. కేవలం ముస్లీంల్లో మాత్రమే ఉగ్రవాదులు ఉన్నారా హిందువుల్లో ఉగ్రవాదులు లేరా అంటూ ప్రశ్నించాడు. అందుకు నేను ఇచ్చిన సమాధానం ఏంటీ అంటే మీలో అందరు కాదు సోదర కొందరు మాత్రం సహకరిస్తున్నారు. అందులో హిందువులు కూడా ఉన్నారు. అంతా చెడ్డ వారు కాదు. కొద్ది మంది చెడ్డ వారు అన్ని చోట్ల ఉన్నారు అనేది తన అభిప్రాయంగా అతడికి చెప్పాను. అంతే తప్ప నేను హిందువులను కించ పర్చే విధంగా ఎక్కడ ఉందో నాకు అర్థం కాలేదు. నేను తెలుగును ఇంగ్లీష్‌ లో రాయడం వల్ల కేసు పెట్టిన వ్యక్తికి కేసు నమోదు చేసిన పోలీసులకు అర్థం కాలేదేమో అంటూ మాధవిలత కామెంట్స్‌ చేసింది.
Tags:    

Similar News