సినీ తారలు జనం మధ్యకి వస్తే ఇబ్బందులు తప్పవు. ఎప్పుడూ తెరపైనే కనిపిస్తూ సందడి చేసే నటుల్ని కళ్లారా చూడాలని తాపత్రయపడుతుంటారు అభిమానులు. వాళ్లకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. అభిమానంతో అలా చేయడం తప్పేమీ కాదు. కానీ అభిమానం మాటున కొద్దిమంది ఆకతాయిలు వాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. హీరోయిన్లకి ఆ కష్టాలు మరింత ఎక్కువ. అసలే సుకుమారమైన అమ్మాయిలు... అలా అసభ్య ప్రవర్తన ఎదురయ్యేసరికి మనసు నొచ్చుకొంటుంటారు. ఇంకోసారి జనం మధ్యకి రావడానికి ససేమిరా అంటుంటారు.
అయితే కొద్దిమంది కథానాయికలకి మాత్రం జనంలోనే కాదు... వాళ్ల సర్కిల్స్ లోనే ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. అవి ఫిర్యాదుల వరకు, కోర్టుల వరకు వెళ్లిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే అచ్చమైన మన తెలుగు కథానాయిక మధుశాలినితో ఇటీవల ఎవరో అసభ్యంగా ప్రవర్తించారట. ఆ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేసి చెప్పింది మధు. అయితే అది ఏ అభిమానుల నుంచో, బయట జనం నుంచే ఎదురైన అనుభవమేమీ కాదు. `ఇలాంటి చెడ్డ ప్రవర్తన ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్నప్పుడే చేస్తారు` అని కూడా ట్వీట్ చేసింది మధు. దీన్నిబట్టి మధుశాలినిని ఎవరో తెలిసినవాళ్లే ఇబ్బంది పెట్టారని అర్థమవుతోంది. అతను అని చెప్పింది కానీ... అదెవరన్నది మాత్రం మధుశాలిని బయటపెట్టలేదు. మధుశాలిని చాలా జోవియల్ గా అందరితో కలిసిమెలసి మెలుగుతూ ఉంటుంది. ఆ చనువును చూసే ఎవరైనా ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించారేమో మరి! అయినా నీ జాగ్రత్తలో నువ్వుండాలమ్మా మధుశాలిని.. !!