ముంబైని బాలీవుడ్ ని మాఫియా విడిచిపెట్టడం లేదు. నిరంతరం స్టార్లకు లేదా వారి కుటుంబ సభ్యులకు బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఇంతకుముందు సల్మాన్ ఖాన్ తండ్రిని చంపేస్తామని వార్నింగ్ అందిన సంగతి తెలిసిందే. సల్మాన్ తండ్రి ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్ జాగింగ్ చేసే పార్క్ లోని ఒక బెంచ్ పై బెదిరింపు లేఖ దొరికింది.
దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాఫియా నుంచి ప్రమాదం పొంచి ఉందని సల్మాన్ ఫ్యామిలీ ఇంటిని పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకుని కాపలా కాసారు.
ఇప్పుడు సల్మాన్ ఖాన్ తర్వాత నటి స్వరా భాస్కర్ కి హెచ్చరిక అందింది. బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ముంబైలోని తన నివాసంలో ఉండగా తనను చంపేస్తామని బెదిరింపులు ఎదురయ్యాయని ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసింది. వెర్సోవాలోని ఆమె ఇంటికి లేఖ పంపడంతో కలకలం చెలరేగింది. ఆమె ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు విచారణ ప్రారంభించారు.
వీర్ సావర్కర్ పై అవమానాలను భారత యువత సహించబోదని ఆ లేఖ(హిందీ)లో రాసి ఉంది. దానిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి హిందీలో సారాంశాన్ని రాసింది స్వరా. ఫిర్యాదు ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తులపై నాన్-కాగ్నిజబుల్ నేరాన్ని నమోదు చేసామని ఒక పోలీస్ అధికారి తెలిపారు.
ఇంతకుముందు వార్నింగులు అందాయి!
సామాజికంగా అవేర్ నెస్ తో మాట్లాడే స్వరాభాస్కర్ ఇంతకుముందు హిందూత్వకు వ్యతిరేకంగా చేసిన కామెంట్లు సంచలనం అయ్యాయి. ఆ తర్వాత తన వ్యాఖ్యలను ప్రణీత సుభాష్ సహా పలువురు ఆక్షేపించారు. దేశంపై జరుగుతున్న దాడుల గురించి ప్రణీత ప్రస్థావిస్తూ స్వరాకి హితవు పలికింది. మీటూ ఉద్యమంలోనూ స్వరా తనకు జరిగిన ఘటనల గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇండస్ట్రీలో వేధింపుల ప్రహసనంపైనా స్వరా ఓపెన్ గా మాట్లాడారు. స్వరా భాస్కర్ నటిగా బిజీ కెరీర్ ని సాగిస్తోంది. బాలీవుడ్ లో పేరున్న సహాయ నటిగా తనకు అవకాశాల పరంగా ఎప్పుడూ కొదవేమీ లేదు. సోషల్ మీడియాల్లో స్వరా తన స్వరాన్ని వినిపించేందుకు ఎప్పుడూ వెనకాడదు. అది యువతరంలో తనకు ఫాలోయింగ్ ని అమాంతం పెంచింది.