'మహా సముద్రం' గురించి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన సంగతులు..!

Update: 2021-10-07 01:30 GMT
వర్సటైల్ యాక్టర్స్ శర్వానంద్ - సిద్దార్థ్ హీరోలుగా 'Rx100' ఫేమ్ అజయ్ భూపతి విభిన్న కథాంశంతో తెర‌కెక్కిస్తున్న చిత్రం ''మహా సముద్రం''. ఇందులో అదితిరావు హైద‌రి - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌ గా న‌టిస్తున్నారు.ఇన్‌టెన్స్ ల‌వ్‌ & యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

- 'మహా సముద్రం' ఎంతో ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమా. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు కచ్చితంగా ఓ మౌనంతో వెళ్తారు. చివరి 40 నిమిషాలు మాత్రం ఎవ్వరూ ఏం మాట్లాడకుండా చూస్తారు. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం.

- మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో అదే 'మహాసముద్రం'. అమాయకపు మనుషుల జీవిత కథలే ఇందులో కనిపిస్తాయి. ఇలాంటి ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం నాకు చాలెంజింగ్ గా అనిపించింది. ఎన్ని రకాలుగా ఇవ్వొచ్చనే విషయం కూడా తెలిసింది. అంద‌రి అంచనాలు మించేలా ఈ సినిమా ఉంటుంది.

- మ్యూజిక్ అనేది కథకు అనుగుణంగానే ఇస్తాను. కథ బాగుంటే.. మ్యూజిక్ కూడా బాగుంటుంది. కథను బట్టే మ్యూజిక్ ఇవ్వడానికి నేను ఎక్కువగా ఇస్తుంటాను.

- 'ఆర్ఎక్స్ 100' సినిమాలో కంటే ఎక్కువ ట్విస్ట్‌ లు 'మహాసముద్రం' లో ఉంటాయి. ఇందులో దాదాపు ఐదారు ట్విస్ట్‌లు ఉంటాయి. అందులో ఒకే ఎమోషన్ ఉంటుంది.. కానీ ఇందులో మల్టిపుల్ ఎమోషన్స్ ఉంటాయి. ఒక అతీంద్రియ శక్తి మనిషిని ఎన్నిరకాలుగా మార్చుతుంది.. కాలం - విధి మనిషిని ఎన్ని రకాలుగా మార్చుతుందనేది ఇందులో చూపించబోతోన్నాం.

- 'ఆర్ఎక్స్ 100' సినిమాకు చేసిన ప్రయోగాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. బాగా ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమాకు ఒళ్లు దగ్గరపెట్టుకుని మరింత జాగ్రత్తగా చేశాను. కచ్చితంగా 'మహాసముద్రం' కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మహా అనే క్యారెక్టర్ చాలా ఇంటెన్స్‌ గా ఉంటుంది. ఆమె జీవితంలో జరిగే ఘటనల ద్వారా చుట్టూ ఉన్న వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఈ కథ.

- కొన్ని కొన్ని జానర్స్ మూవీ సెంట్రిక్‌ గా చేయాల్సి ఉంటుంది. మూవీకి ఆ పర్టిక్యులర్ సీన్‌ కు పాట ఆడియెన్స్‌ కు కనెక్ట్ అయితే.. ఆ పాట హిట్టైనట్టే. 'ఆర్ఎక్స్ 100' సినిమా అనేది ఎమోషన్స్, లవ్, యాక్షన్ అన్ని కలిపి ఉంటాయి. ఆ సినిమాలోని పాటలు ఆడియెన్స్‌ ను కనెక్ట్ అయ్యాయి. ఆ సెక్షన్ ఆడియెన్స్‌ కు కనెక్ట్ అయ్యాయంటే హిట్ అయినట్టే. 'మహా సముద్రం' సినిమాలో నాకు 'చెప్పకే చెప్పకే' అనే పాట ఎక్కువగా ఇష్టం. మంచి మూమెంట్‌ లో ఆ పాట వస్తుంది. 'హే రంభా' పాట పాడటం నాకు సంతోషంగా అనిపించింది.

- నాకు కథను ఎంతో క్లియర్‌ గా, డీటైల్డ్‌ గా చెప్పారు. నా టోన్ ఆ స్టోరీకి సరిపోతుందని అజయ్ భూపతి గారు నమ్మారు. లైవ్ బేస్డ్‌ ఎలిమెంట్స్ చేసే స్కోప్ ఇచ్చారు. నాకు డీటైల్డ్ ఎమోషన్ కనుక్కుని మ్యూజిక్ ఇవ్వడం ఇష్టం. అందుకే నేను చేసిన ప్రతీ అటెంప్ట్ పాజిటివ్‌ గానే తీసుకున్నారు.

- ప్రతీ ఒక్కరూ అద్బుతంగా నటించేశారు. అంత ఇంటెన్స్ ఉన్న సినిమాను ఈ మధ్య కాలంలో చూసి ఉండరు. ప్రతీ ఒక్క పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడం చాలా కష్టంగా అనిపించినా.. చాలెంజింగ్‌ గా తీసుకున్నాను.

- పాటను జనాలకు రీచ్ అయ్యేట్టుగా సంగీతం ఇవ్వాల్సి ఉంటుంది. కథను తగ్గట్టుగానూ ఉండాలి. అందుకే పాటలు చేసేటప్పుడే రెండు రకాలుగా ఆలోచిస్తాను. సినిమాను ముందుకు తీసుకెళ్లేలా ఉండాలని, జనాలకు నచ్చే విధంగా ఉండాలనుకుంటాను. ఈ సినిమాలో 'చెప్పకే చెప్పకే' అనే పాటకు ఎక్కువ సమయం తీసుకున్నాను. లిరిక్ రైటర్స్ చాలా కష్టపడి రాశారు. పాటలో అమాయకత్వం, సిట్యువేషన్‌కు తగ్గట్టు పాట, పాటకు తగ్గ లిరిక్స్ అన్నీ ఇలా కుదిరాయి. చైతన్య ప్రసాద్, భాస్కరభట్ల, కిట్టు విశ్వప్రగడ అందరూ అద్భుతంగా రాశారు. సినిమాలోని ఎమోషన్‌ను ముందుకు తీసుకెళ్లారు.

- బ్యాక్ గ్రౌండ్ కన్నా.. సాంగ్స్ చేయడమే నాకు ఇష్టం. పాటలు చేయడంలో ఫ్రీడం ఎక్కువగా ఉంటుంది. 'ఆర్ఎక్స్ 100'లో 'రుధిరం'.. 'ఎస్ఆర్ కళ్యాణమండపం'లోని 'చుక్కల చున్నీ' బాగా ఇష్టం.

- పాటలు ఎప్పుడు కూడా సినిమాకు తగ్గట్టే ఉండాలి. పాటలను బట్టే సినిమాలను చూస్తున్నారు. 'ఆర్ఎక్స్ 100' సినిమాకు అంత ఆదరణ ఇచ్చినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. నా జర్నీ నాకు ఎంతో సంతృప్తిగా ఉంది. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ సినిమా ఒకటి చర్చల్లో ఉంది.


Tags:    

Similar News