25 ఏళ్ల తర్వాత మహేష్ చేస్తున్నాడు

Update: 2017-09-17 17:30 GMT
బాక్స్ ఆఫీసు ను తాకే సినిమాలు చాలా వస్తాయి. కానీ చరిత్రను తిరగరాసే సినిమాలు కొన్నే వస్తాయి. ప్రతి స్టార్ కి అలాంటి ఛాన్స్ ఒక్కసారి వస్తే నిరూపించుకోవాలని చాలా కష్టపడతారు. టాలీవుడ్ లో ఇప్పుడు అలాంటి చరిత్రని తిరగరేసే కోణాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారీ ప్రాజెక్టులు బాగానే తెరకెక్కుతున్నాయి. ఒకప్పుడు తమిళ్ సినిమాలు బాలీవుడ్ కి పోటీని ఇచ్చేవి. కానీ ఇప్పుడీ తెలుగు సినిమాలు ఏకంగా బాలీవుడ్ కి పోటీని ఇచ్చే స్థాయికి వచ్చాయి.

ఇక అసలు విషయానికి వస్తే బైలింగువల్ ఫిలిమ్స్ ను ఏ హీరో అంతగా ట్రై చేయలేదు. ప్రయత్నించిన వారు కూడా ఘోర పరాజయాలను చూశారు. తమిళ్ హీరోలు ఇక్కడ డబ్బింగ్ సినిమాలతో బాగానే హిట్స్ అందుకుంటున్నా మన హీరోలు అక్కడ డబ్బింగ్ చేసిన సినిమాలు అంతగా ఆడడం లేదు. అయితే ఒక్కోసారి భారీ బడ్జెట్ తో తెరకెక్కించే సినిమాలను ఎక్కువ మార్కెట్ లో రిలీజ్ చేస్తే మంచిదని బైలింగువల్ లో తెరకెక్కిస్తారు. తెలుగులో నాగార్జున 1990 లో రక్షకుడు అనే తెలుగు -తమిళ్ లో తీశాడు. కానీ ఆ సినిమా ఊహించని రిజల్ట్ ని ఇచ్చింది. దీంతో బాలకృష్ణ-చిరంజీవి అక్కడ ప్రయత్నాలు చేయవద్దని డిసైడ్ అయ్యారు. అంతకుముందు వారు కూడా తమిళ్ లో తీద్దాం అనుకున్నారు కానీ నాగార్జున సినిమా షాక్ ఇవ్వడంతో వారు తెలుగే బెస్ట్ అని సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో 25 ఏళ్ల తర్వాత హీరో మహేష్ భారీ స్థాయిలో బైలింగువల్ సినిమాతో తిరిగి ఒక ప్రయోగం చేస్తున్నాడనే చెప్పాలి. అదే స్పైడర్.

కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తమిళ్ దర్శకుడితోనే ఈ ప్రయోగం చేయడం కొంత ప్లస్ అనుకోవచ్చు. కానీ టాలీవుడ్ హిరోలకి కలిసి రాని బైలింగువల్ ఫిల్మ్ మహేష్ కలిసొస్తుందా అనేది ఇప్పుడు అందరి దృష్టిలో మెదులుతున్న ప్రశ్న. స్పైడర్ ఒకే సారి తెలుగు - తమిళ్ లో తెరకెక్కబోతోంది ఇప్పటికే ఆ సినిమా ట్రైలర్స్ తో హైప్ ని బాగా పెంచేసింది. తమిళ్ లో కూడా మహేష్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్న విషయం అక్కడ రిలీజ్ చేసిన ఆడియో వేడుకలో అర్థమైపోయింది. ఈ పరిణామాల్ని చూస్తుంటే మహేష్ తప్పకుండా బైలింగువల్ బాక్స్ ఆఫీస్ హిట్ ని అందుకొని చరిత్ర తిరగరాయగలడని అందరు నమ్మకంతో ఉన్నారు ఫిలిం లవర్స్.


Tags:    

Similar News