మహేష్ బాబు తన ప్రతిష్టాత్మక 25వ చిత్రం దర్శకత్వ బాధ్యతలను వంశీ పైడిపల్లికి అప్పగించి ఆయనపై చాలా పెద్ద భారం ఉంచాడు. మహర్షి వంటి ఒక విభిన్నమైన మూవీని మహేష్ కు ఇచ్చి వంశీ మంచి పేరు దక్కించుకున్నాడు. మహర్షి చిత్రంతో మహేష్ బాబు వంశీల మద్య మంచి స్నేహం ఏర్పడినది. పవన్ త్రివిక్రమ్ తరహాలో వీరిద్దరు మంచి మిత్రులు అయ్యారంటూ టాక్ వినిపించింది. 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చేస్తున్న సమయంలోనే 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేయబోతున్నట్లుగా మహేష్ బాబు హింట్ ఇచ్చాడు.
సరిలేరు నీకెవ్వరు షూటింగ్ సెట్స్ లో పబ్లిసిటీ కార్యక్రమాల్లో మహేష్ వెంట వంశీ ఉన్నాడు. మహేష్ మూవీ సరిలేరు నీకెవ్వరు విడుదలైన వెంటనే వంశీతో సినిమా గురించిన చర్చ జరిగింది. ప్రారంభంకు సంబంధించిన ప్రకటన కూడా వస్తుందని భావించారు. అయితే అనూహ్యంగా వంశీతో కాకుండా తదుపరి చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో చేయాలని మహేష్ బాబు నిర్ణయించుకున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. సర్కారు వారి పాట టైటిల్ తో సినిమాను ప్రకటించారు. ఈ సమయంలో వంశీతో క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్లే మహేష్ ఆయన్ను పక్కకు పెట్టాడంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది.
మహేష్ దాదాపు ఏడాది పాటు తిప్పించుకుని వంశీని కాదనడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేశారు. ఇద్దరి మద్య కోల్డ్ వార్ సాగుతుందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆమద్య ఒక సందర్బంలో ఇద్దరు కలిసి కనిపించారు. అయినా కూడా ప్రచారం మాత్రం ఆగలేదు. ఇక నేడు మహేష్ బాబు సోషల్ మీడియాలో వంశీ బర్త్ డే సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. మహేష్ చాలా రేర్ గా ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాడు. అలాంటిది వంశీ తనకు ఆప్త మిత్రుడు అవ్వడం వల్లే శుభాకాంక్షలు చెప్పాడంటూ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ పోస్ట్ తో అయిన మహేష్ బాబు వంశీల మద్య ఎలాంటి విభేదాలు లేవని నమ్ముతారా అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.