పారిస్‌ లో మ‌హేష్ ఫ్యామిలీ భలే

Update: 2018-05-05 07:13 GMT
మ‌హేష్ బాబు సూప‌ర్ హీరోనే కాదు బాధ్య‌త గ‌ల తండ్రి కూడా. అందుకే త‌న పిల్ల‌ల‌ను తీసుకుని ప్ర‌తి ఏడాది సెల‌వులకు ఏదో ఒక దేశానికి ఎగిరిపోతుంటాడు. లేదా చేసిన సినిమా విడుద‌ల‌య్యాక కూడా కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఫ్యామిలీతో క‌లిసి అలా కొన్ని రోజులు విదేశాల‌లో సేద‌తీరి వ‌స్తుంటాడు. గ‌తంలో ఇలా చాలా సార్లు వెళ్లాడు. తాజాగా భ‌ర‌త్ సినిమా విడుద‌ల తరువాత భార్యా పిల్ల‌లతో క‌లిసి పారిస్ వీధుల్లో షికార్లు కొడుతున్నాడు.

భర‌త్ అను నేను సినిమా ఊహించిన‌ట్టుగానే మహేష్ ఖాతాలో మ‌రో హిట్ ను జ‌త‌చేర్చింది. ఆ సినిమా షూటింగ్ మొద‌లైన‌ప్ప‌ట్నించి విడుద‌లై హిట్ టాక్ వ‌చ్చేదాకా చిత్ర‌యూనిట్ కాస్త టెన్ష‌న్ ప‌డుతూనే ఉంది. ఎప్పుడైతే హిట్ టాక్ వచ్చిందో అంతా రిలాక్స‌య్యారు. మొన్న‌నే స‌క్సెస్ మీట్ కూడా పూర్తి చేసుకున్నారు. ఇక మిగిలింది కుటుంబంతో ఎంజాయ్ చేయ‌డ‌మే. ఆ విష‌యంలో మ‌హేష్ బాబు ముందుంటాడు. అందుకే భార్య న‌మ్ర‌తా పిల్ల‌లు సితార గౌత‌మ్‌ల‌తో క‌లిసి పారిస్ టూర్ కు వెళ్లాడు. న‌మ‌త్రా శిరోద్క‌ర్ ఆ టూర్ ఫోటోల‌ను త‌న ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.  ఒక ఫోటోలో మ‌హేష్ బాబు కూతురు సితార‌తో క‌లిసి లోక‌ల్ ట్రైన్‌ లో ప్ర‌యాణం చేస్తున్నాడు.

మ‌రొక ఫోటోలో ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి సామాన్య వ్య‌క్తిలో పారిస్ వీధుల్లో షికారు చేస్తున్నాడు. ఈఫిల్ ట‌వ‌ర్ ద‌గ్గ‌ర తీయించుకున్న ఫోటోల‌ను కూడా న‌మ్ర‌తా షేర్ చేసింది. మ‌హేష్  ఇప్పుడే కాదు గ‌తంలో కూడా కుటుంబంతో క‌లిసి పారిస్‌కు వెళ్లాడు. ఈసారి మంచి ఎండ‌ల్లో ప్ర‌యాణం క‌ట్టాడు. ఈ ఫోటోలు మ‌హేష్ అభిమానులను కాస్త నిరాశ‌ప‌రిచాయి. ఎందుకంటే ఏ ఫోటోలోను మ‌హేష్ ముఖం క‌నిపించ‌డం లేదు. న‌మ‌త్రా ఎక్కువ‌గా పిల్ల‌ల ఫోటోలే పోస్టు చేసింది. త‌మ అభిమాన హీరో ఫోటోల‌ను కూడా పోస్టు చేయమంటూ ఫ్యాన్స్ న‌మ్ర‌త‌ను కోరుతున్నారు.


మరిన్ని ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి
Tags:    

Similar News