బాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రద్దా కపూర్ తెలుగులో ‘సాహో’ చిత్రంతో పరిచయం అయిన విషయం తెల్సిందే. సాహో తర్వాత ఈ అమ్మడికి తెలుగు నుండి పలు ఆఫర్లు వచ్చాయట. కాని బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా నో చెప్పిందని తెలుస్తోంది. ఈమె సౌత్ లో నటించేందుకు భారీ పారితోషికం డిమాండ్ చేస్తుందని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలో తెలుగులో సూపర్ స్టార్ సినిమాకు ఈమె ఓకే చెప్పే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
మహేష్ బాబు 27వ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నాడట. ఆ సినిమాను మైత్రి మూవీస్ ఇంకా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవల్ లో సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో పరశురామ్ యూనివర్శిల్ కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది.
మహేష్ బాబుకు ఉన్న స్టార్ డం కారణంగా శ్రద్దా - మహేష్ తో నటించేందుకు ఓకే చెప్పే అవకాశం ఉందని అలాగే భారీ పారితోషికం కూడా ఆమెను తెలుగులో నటించేలా చేసిందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మహేష్ బాబుతో ఈమె నటిస్తే ఖచ్చితంగా ఉత్తరాదిన సినిమాకు మంచి బజ్ ఏర్పడుతుంది. అందుకే ఈమెను కాస్త ఖరీదు ఎక్కువ అయినా కూడా తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై మహేష్ బాబు ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారట.
సాహో చిత్రం తెలుగులో పెద్దగా ఆడినది లేదు.. ఇక్కడ ఆమెకు బజ్ ఉన్నది కూడా లేదు. అందుకే ఆమె కంటే మరింత క్రేజ్ ఉన్న బాలీవుడ్ ముద్దుగుమ్మను మహేష్ 27 లో నటింపజేయాలంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ విజ్ఞప్తిని మేకర్స్ ఏమైనా పట్టించుకుంటారా లేదంటే వారు అనుకున్న అమ్మాయితో ముందుకు వెళ్తారో చూడాలి. జులై లేదా ఆగస్టులో సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.