మ‌హేష్ మాంచి ఊపున్న పాటే కావాల‌న్నారా?

Update: 2022-05-11 02:30 GMT
ప్ర‌స్తుతం స్టార్ హీరోలంతా మాస్ మంత్రం ప‌ఠిస్తున్నారు. యాక్ష‌న్ సినిమాలకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న నేప‌థ్యంలో అంతా ఈ త‌ర‌హా చిత్రాల వైపై అడుగులు వేస్తున్నారు. ఏ క‌థ చేసినా అందులో మాస్ ని మెప్పించే యాక్ష‌న్ ఖ‌చ్చితంగా వుండేలా ప్లాన్ చేయిస్తున్నారు. అలాంటి క‌థ‌ల‌కు ప్ర‌ధ‌మ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఇక దీంతో పాటు ఊపున్న పాట వుంటే ఆ మ‌జాయే వేరు అన్న‌ది స్టార్ హీరోల వాద‌ని. అలాంటి ఊపున్న పాటే తాజాగా త‌న‌కూ కావాల‌న్నార‌ట సూప‌ర్ స్టార్ మహేష్ బాబు.

ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 ప్ల‌స్ రీల్స్‌, జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించాయి. ఈ నెల 12న ఈ మూవీ అత్యంత భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న విష‌యం తెలిసిందే. దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత మ‌హేష్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

అంతే కాకుండా త‌మ అభిమాన హీరో సినిమా కోసం ఇంత కాలంగా ఎదురుచూస్తున్నా ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని రెట్టింపు చేసింది. ట్రైల‌ర్ లో మ‌హేష్ త‌న‌దైన స్టైల్లో డైలాగ్‌లు, ఫైట్ ల‌తో మెరుపులు మెరిపించ‌డంతో అభిమానులు సెల‌బ్రేష‌న్స్ మోడ్ లోకి వెళ్లాపోయారు. ఎంతో కాలంగా తాము ఎదురుచూస్తున్న సినిమా ఇదేనంటూ పండ‌గ చేసుకుంటున్నారు.

ఈ స‌మ్మ‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అంటూ సంబ‌రాలు చేసుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఇదిలా వుంటే ఈ సినిమా కోసం షూట్ చేసిన మెలోడీ సాంగ్ ని తొల‌గించి మాంచి ఊపున్న మాస్ బీట్ ని యాడ్ చేశార‌ట‌. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందించాడు. అత‌ను అందించిన పాట‌ల‌న్నీ సూప‌ర్ హిట్స్ అయ్యాయి. అయితే ఈ చిత్రం కోసం మాస్ బీట్ కాకుండా మెలోడీ సాంగ్ ని షూట్ చేశార‌ట‌. అయితే ఆ ప్లేస్ లో త‌న‌కు మాంచి ఊపున్న పాట కావాల‌ని మ‌హేష్ చెప్పార‌ట‌.

దాంతో త‌మ‌న్ అప్ప‌టిక‌ప్పుడు మాస్ బీట్ ట్యూన్ ని రెడీ చేసిచ్చార‌ట‌. దానికి త‌గ్గట్టుగా అనంత‌శ్రీ‌రామ్ పాట రాశార‌ట‌. అదే `మ‌మ మ‌హేష్ ..` పాట రెడీ కావ‌డంతో ప్ర‌త్యేకంగా సెట్ వేసి ఈ పాట‌ని మ‌హేష్‌, కీర్తి సురేష్ ల‌పై శేఖ‌ర్ మాస్ట‌ర్ నేతృత్వంలో చిత్రీక‌రించార‌ట‌. ఈ పాట కోసం మెలోడీ సాంగ్ ని తొల‌గించి ఆ స్థానంలో `మ‌మ మ‌హేష్ ..`అంటూ సాగే మాస్ సాంగ్ ని ప్ర‌త్యేకంగా జోడించార‌ట. ఈ విష‌యాన్ని హీరో మ‌హేష్ స్వ‌యంగా వెల్ల‌డించ‌డం విశేషం. `ముందు ఓ మెలోడీ సాంగ్ చేశాం. అయితే అది సూట్ కాలేదు.  ఇక్క‌డ ఓ మాస్ సాంగ్ ప‌డితే బాగుంటుంద‌ని సంద‌ర్భం డిమాండ్ చేసిన‌ట్టుగా అనిపించింది. త‌మ‌న్ మంచి ట్యూన్ ఇచ్చాడు. అలా `మ‌మ మ‌హేష్ ..` సాంగ్ ని షూట్ చేశాం. పాట బాగా వ‌చ్చింది. థియేట‌ర్ లో ఈ పాట‌ని ఎంజాయ్ చేస్తారు` అని మ‌హేష్ వివ‌రించారు.
Tags:    

Similar News