SSMB28 : ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన నమ్రత

Update: 2022-08-14 06:32 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.. చూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. సినిమాకు సంబంధించిన అప్డేట్ ను నమ్రత స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

మహేష్ బాబు చాలా నెలల తర్వాత మళ్లీ షూట్‌ లో పాల్గొన్నాడు. త్రివిక్రమ్‌ మరియు మహేష్ బాబు కాంబో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా గత రెండేళ్లుగా త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ కు పదును పెడుతూనే ఉన్నాడు. త్రివిక్రమ్ గత సినిమా అల వైకుంఠపురం లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే.

త్రివిక్రమ్‌ మరియు మహేష్‌ బాబు ల కాంబినేషన్‌ లో అతడు మరియు ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాలు కూడా ఆశ్చర్యకరంగా థియేటర్‌ రిలీజ్‌ అయ్యి పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ బుల్లి తెర పై ఎంత భారీ విజయాలను ఈ రెండు సినిమాలు దక్కించుకున్నాయో అందరికి తెల్సిందే. అందుకే అభిమానులు వీరి కాంబోలో మూడవ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.

చాలా నెలలుగా ఎదురు చూస్తున్న అభిమానులకు నమ్రత సర్ ప్రైజ్‌ అప్‌డేట్ ఇచ్చింది. షూట్ డే అంటూ మహేష్‌ బాబు షూటింగ్ లో పాల్గొన్న ఫోటోను నమ్రత షేర్‌ చేశారు. ఎట్టకేలకు మహేష్‌ బాబు సినిమా ప్రారంభం అవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ వర్క్ కు ఎక్కువ సమయం తీసుకోవడం తో తప్పకుండా సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

హీరోయిన్ గా ఈ సినిమా లో పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు ఈ సినిమాలో కీలకమైన మరో పాత్రలో ఇంకో హీరోయిన్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను స్పీడ్ గా ముగించి వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
Tags:    

Similar News