మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ28 నుంచి లేటెస్ట్ ఫొటో వైరల్..!

Update: 2023-02-02 13:36 GMT
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ28 గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీలలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి మమత సమర్పణలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గతేడాదిలోనే స్టార్ అయింది.అయితే ఓ షెడ్యూల్ కు సంబంధించిన చిత్రీకరణ పూర్తవగా.. సెకండ్ షెడ్యూల్ కూడా ఇటీవలే ప్రారంభం అయింది. మహేశ్ బాబు వ్యక్తిగత కారణాల వల్ల సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కి కొంత గ్యాప్ వచ్చింది.

జనవరి 18వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను ప్రారంబించారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేసేందుకు నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్, ఇతర పనులను చకచకా పూర్తి చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ ఫొటో నెట్టింట వైరల్ అయింది. అందులో మహేష్ బాబుతో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఉన్నారు. మహేష్ బాబు దేని గురించో తీక్షణంగా ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.

ఈ సినిమాలో భారీ యాక్షన్ ఫైట్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ లు కొరియా గ్రాఫ్ చేస్తున్న ఫైట్ సీన్స్ ఈనెల మొదటి వారంతో పూర్తి అవుతాయి. ఇప్పటికే చాలా సమయం వృథా అయింది కాబట్టి మహేష్ బాబు కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమా షూట్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు.

ఈ షూటింగ్ త్వరగా పూర్తి చేసుకుంటే దర్శకధీరుడు రాజమౌళి డెరైక్షన్ లో రాబోతున్న సినిమాలో నటించవచ్చని భావిస్తున్నారట.

ఈ సినిమాను హారిక హాసిని దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని సమాచారం. ఆగస్టు 11వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఈ రేంజ్ లో అలరించబోతుందో తెలియాలంటే ఇంకా కొంత ఆగాల్సిందే మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News