తెలుగు రాష్ర్టాల్లో సూపర్ స్టార్ ఇమేజి ఉన్న మహేశ్ బాబు పక్క రాష్ర్టాల్లో మాత్రం పెద్దగా ఫ్యాన్సు లేరు. మహేశ్ సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ అయినా కూడా అంతంతమాత్రంగానే ఆడుతున్నాయి. ముఖ్యంగా పెద్ద ఫిల్మ్ మార్కెట్ అయిన తమిళనాడులో మహేశ్ రికార్డేమీ బాగులేదు. మహేశ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన శ్రీమంతుడు కూడా తమిళనాడు పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో దసరాకు రానున్న మహేశ్ సినిమా స్పైడర్ తో తమిళనాడులో మంచి బిజినెస్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే... తమిళనాట మహేశ్ మార్కెట్ ఎంతన్న ప్రశ్న ఇప్పుడు ఫిలిం సర్కిళ్లలో వినిపిస్తోంది.
తమిళ మార్కెట్ లక్ష్యంగానే మహేశ్ ఈ సినిమాకు మురుగదాస్ ను డైరెక్టరుగా ఎంచుకున్నారని చెప్తున్నారు. తమిళనాట శంకర్ తరువాత మురుగదాస్ సెకండ్ పొజిషన్లో ఉణ్నారు. ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వం - హరీశ్ జైరాజ్ మ్యూజిక్ - సంతోష్ శివన్ ఫొటోగ్రఫీ వంటివన్నీ తమిళనాడులో ఈ సినిమాను ఆడేలా చేస్తాయని భావిస్తున్నారు.
అయితే... కోలీవుడ్ వర్గాల కథనం ప్రకారం స్పైడర్ ను కొనడానికి తమిళ బయ్యర్లు రూ.20 కోట్లు కంటే ఎక్కువ పెట్టడం లేదట. భారీ అంచనాలు పెట్టుకున్నా మొత్తం తమిళనాడుకు ఇంతకు మించి చెల్లించడానికి ఎవరూ ముందుకురావడం లేదని టాక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/