మహేష్ బాబు కొత్త సినిమా భరత్ అనే నేను సంగతులు వాడి వేడిగా ఉండగానే.. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రం చేసేందుకు రెడీ అయిపోతున్నాడు. మహేష్ బాబు అక్క పద్మావతి కుమారుడు.. అంటే ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్.. సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గతంలోనే చెప్పుకున్నాం.
దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుందనే విషయంపై కూడా ఇప్పటికే క్లారిటీ ఉంది. దిల్ రాజు బ్యానర్.. మహేష్ బాబు పేరు.. మంత్రి కుమారుడు.. ఇంతలేసి పెద్ద పెద్ద పేర్లు ఉన్నపుడు పెద్ద దర్శకుడితో సినిమా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ కృష్ణారెడ్డి అనే డైరెక్టర్ తో గల్లా అశోక్ ను లాంఛ్ చేయిస్తుండడం విశేషం. గతంలోనూ ఇతడు సూపర్ స్టార్ ఫ్యామిలీకే చెందిన సుధీర్ బాబుతో సినిమా చేశాడు. ఆడు మగాడ్రా బుజ్జి అనే టైటిల్ పై సుధీర్ బాబుతో చేసిన సినిమా అంతగా ఆడలేదు.
నిజానికి అశోక్ కోసం వేరే దర్శకుడు కథ తయారు చేశాడు. కానీ అతడికి ప్రాజెక్టు ఇవ్వడంపై టీంకు గురి కుదరలేదు. ఇలాంటి సమయంలో.. సుధీర్ బాబు స్వయంగా తానే కృష్ణా రెడ్డి ని రికమెండ్ చేశాడట. తనతో సినిమా తీసిన సినిమా ఫ్లాప్ అయినా.. కృష్ణారెడ్డికి మరో అవకాశం ఇప్పించాడట సుధీర్ బాబు. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రం మే నెలలో విడుదల కానుండగా.. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి చెందిన హీరో కావడంతో.. అభిమానుల్లో ఇతడిపై ఆసక్తి కనిపిస్తోంది.