స్పైడర్.. అసలు ఏ టైపు సినిమా?

Update: 2017-05-26 08:38 GMT
తన కొత్త సినిమా ‘స్పైడర్’లో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్లుగా చాన్నాళ్ల కిందటే వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర బృందమేమీ ఖండించలేదు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తే ఆ విషయం నిజమే అనిపించింది. ఐతే ఇంటలిజెన్స్ ఆఫీసర్ పాత్ర అంటే.. కథ ఎలా సాగే అవకాశముందో ప్రేక్షకులకు కొన్ని అంచనాలున్నాయి. ఇదొక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అయి ఉంటుందని భావిస్తున్నారు. మరి ఇలాంటి సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు చాలా ప్రాధాన్యం ఉందని అంటుండటం.. దానికి సంబంధించిన వర్క్ వల్లే సినిమా ఆలస్యమవుతోందని వార్తలు రావడం జనాల్ని ఆశ్చర్యపరిచింది. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఇండియాలో టాప్ మోస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్లలో ఒకడైన కమల్ కణ్ణన్ ను ఈ సినిమా కోసం తీసుకున్నారన్న సమాచారం బయటికి వచ్చింది.

మగధీర.. ఈగ.. బాహుబలి-2 లాంటి సినిమాలకు పని చేశాడు కమల్ కణ్ణన్. అలాంటి వాడిని ఏరి కోరి ఎంచుకున్నారంటే ‘స్పైడర్’లో విజువల్ ఎఫెక్టులకున్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ అనగానే ఫాంటసీ టైపో.. సైంటిఫిక్ థ్రిల్లర్లనో ఊహిస్తాం. ఐతే ‘స్పైడర్’ ఆ తరహా సినిమా అన్న సంకేతాలేమీ ఇప్పటిదాకా బయటికి రాలేదు. దీంతో ఈ సినిమా ఏ జానర్ అనే విషయంలో జనాల్లో కన్ఫ్యూజన్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ‘స్పైడర్’ టీజర్ రిలీజ్ చేస్తారంటున్నారు. ఆ టీజర్ ఏమైనా సినిమా జానర్ విషయంలో హింట్స్ ఏమైనా ఇస్తుందేమో చూడాలి. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News