‘బాహుబలి: ది కంక్లూజన్’తో వర్చువల్ రియాలిటీ అనే కొత్త సాంకేతిక నైపుణ్యాన్ని ఇండియన్ ఆడియన్స్ కు పరిచయం చేసి ఒక కొత్త అనుభూతిని పంచింది రాజమౌళి బృందం. మహిష్మతి సామ్రాజ్యాన్ని 360 డిగ్రీల కోణంలో చూస్తూ అక్కడే ఉన్న అనుభూతి పొందుతూ పులకించి పోయారు మన ప్రేక్షకులు.
ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుని మున్ముందు మరిన్ని వర్చువల్ రియాలిటీ వీడియోలు వస్తాయని భావిస్తుండగా.. మహేష్ బాబు కొత్త సినిమా ‘స్పైడర్’ టీం కూడా ఈ టెక్నాలజీని వాడుకునే ప్రయత్నంలో పడింది. ‘స్పైడర్’ సినిమాకు సంబంధించి వీఆర్ టెక్నాలజీతో ఒక స్పెషల్ వీడియో రూపొందించిందట చిత్ర బృందం. ఆ వీఆర్ వీడియోను హాలీవుడ్లోని ఒక స్టూడియోలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. మరి అక్కడ ఈ వీడియోకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
మనకు వీఆర్ వీడియోలు కొత్త కానీ.. హాలీవుడ్లో ఈ టెక్నాలజీ ఎప్పట్నుంచో అందుబాటులో ఉంది. ఆ టెక్నాలజీలో ఎన్నో ఆసక్తికర వీడియోలు వచ్చాయి. హాలీవుడ్లో లాంచ్ చేశాక ఇక్కడి ప్రేక్షకుల కోసం కూడా ఆ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు ‘స్పైడర్’ చిత్ర బృందం ఇంకొక్క పాట మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఆ పాటను మహేష్ బాబు-రకుల్ ప్రీత్ ల మీద రొమేనియాలో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం రొమేనియాకు బయల్దేరింది. సరిగ్గా ఇంకో నెల రోజుల్లో ‘స్పైడర్’ తెలుగు.. తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.