2020 ముందు వరకు ఇండియాలో వెబ్ సిరీస్ లు.. ఓటీటీల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇండియాలో ఓటీటీ మార్కెట్ విస్తరించడానికి కనీసం 2025 వరకు వేచి చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు అనుకునే వారు. కాని కరోనా కారణంగా ఇండియాలో వెబ్ సిరీస్ లకు మరియు ఓటీటీ కంటెంట్ కు విపరీతమైన ఆధరణ పెరిగింది. ఈ ఏడాదిన్నర కాలంలో ఓటీటీ వినియోగ దారుల సంఖ్య కొన్ని వందల రెట్లు పెరిగి ఉంటుంది అనడంలో సందేహం లేదు. కొత్త ఓటీటీలు వచ్చాయి.. పాత వాటికి విపరీతమైన ఆధరణ దక్కింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్స్ ఓటీటీ ఎంట్రీకి ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ వంటి సూపర్ స్టార్ కూడా వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే వార్తలు వచ్చాయి. ఇక తెలుగు లో వెంకటేష్.. రానా.. చైతూ.. సమంత.. కాజల్.. తమన్నా వంటి స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లు చేశారు.. చేసేందుకు సిద్దం అవుతున్నారు. వీరి దారిలోనే మరి కొందరు స్టార్స్ కూడా వెబ్ సిరీస్ ల్లో ఓటీటీ కంటెంట్ లో నటించేందుకు ఓకే చెప్తారనే వార్తలు వస్తున్నాయి.
ఈ సమయంలో మహేష్ బాబు అభిప్రాయం ఏంటీ అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇటీవల మీడియా ప్రయత్నించింది. తాజాగా మహేష్ బాబు బిగ్ సి మొబైల్ స్టోర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా తాజాగా మహేష్ బాబు మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. మీడియా ముందు ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. తన వ్యక్తిగత విషయాలు మరియు సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మహేష్ బాబు మీడియాతో షేర్ చేసుకున్నాడు.
ఆ సమయంలోనే పలువురు స్టార్స్ వెబ్ సిరీస్ లు చేసేందుకు సిద్దం అవుతున్నారు కదా.. మీకు ఆ ఆలోచన ఉందా అన్నట్లుగా ప్రశ్నించగా మహేష్ బాబు ప్రస్తుతానికి వెబ్ సిరీస్ ల్లో నటించాలనే ఆసక్తి ఉద్దేశ్యం తనకు లేదు అంటూ తేల్చి చెప్పాడు. కాని తాను వెబ్ సిరీస్ లకు మాత్రం వ్యతిరేకం కాదని చెప్పాడు. పలు వెబ్ సిరీస్ లను తాను చూస్తాను అన్నాడు. ఫ్రెండ్స్ వెబ్ సిరీస్ ను తాను ఎక్కువగా చూస్తాను. స్ట్రెస్ బస్టర్ గా నాకు ఆ వెబ్ సిరీస్ పని చేస్తుందని చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు వెబ్ సిరీస్ ల గురించి వ్యతిరేకత లేకపోవడంతో పాటు ఇప్పుడు నటించే ఉద్దేశ్యం లేదు అన్నాడు కనుక ముందు ముందు అందరు హీరోలు అటుగా వెళ్తే తప్పకుండా మహేష్ బాబు కూడా వెబ్ కంటెంట్ లో నటించే అవకాశాలు లేకపోలేదు అనిపిస్తుంది.
ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్ లో సినిమా కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆ వెంటనే నవంబర్ లేదా అంతకంటే ముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడవ సినిమాను చేసేందుకు మహేష్ బాబు ఇప్పటికే ఓకే చెప్పాడు. వీరిద్దరి కాంబో మూవీకి అతడే పార్థు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ బాబు టాలీవుడ్ జక్కన్న రాజమౌళిల కాంబోలో ఒక సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఆర్ ఆర్ ఆర్ ను రూపొందిస్తున్న జక్కన్న ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమాను చేస్తానంటూ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. అయితే వీరి కాంబో మూవీ ప్రారంభం అవ్వడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపు మహేష్ బాబు ఈ రెండు సినిమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడేమో చూడాలి.