ప్రస్తుత జనరేషన్ లోని స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ మహేష్ బాబు ఇద్దరూ బ్రహ్మాండమైన క్రేజ్ ఉన్న హీరోలు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా వీళ్లిద్దరికి అభిమానులు ఉన్నారు. మాస్ క్లాస్ యూత్ అనే తేడా లేకుండా ఇద్దరికీ అన్ని వర్గాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగట్టగల స్టామినా ఇద్దరికీ సరి సమానంగానే ఉంది. అనుకోని విధంగా ఈ ఇధ్దరి సినిమాలు ఒకే టైంలో రాబోతున్నాయి. మహేబ్ బాబు నటించిన స్పైడర్ - ఎన్టీఆర్ జై లవకుశ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఎన్టీఆర్ అండ్ మహేష్ బాబు సినిమాలు ఇలా పోటాపోటీగా థియేటర్లకు రావడం ఇది మొదటిసారేమీ కాదు. అసలు వీళ్ల కెరీర్ లో ఇలా ఒకేటైంలో పోటీగా సినిమాలు రిలీజవడం ఇది నాలుగోసారి తెలుసా?. మొదటిసారి ప్రిన్స్ కెరీర్ లో మరిచిపోలేని హిట్ సినిమా అయిన ఒక్కడు.. ఎన్టీఆర్ సినిమా నాగ పోటాపోటీగా వచ్చాయి. ఆ తర్వాత ఏడేళ్ల వరకు అలాంటి పరిస్థితి రాలేదు. రెండోసారి ఖలేజా - బృందావనం సినిమాలు ఒకేటైంలో వచ్చాయి. వీటి తర్వాత తక్కువ గ్యాప్ లోనే మరోసారి పోటీ తలెత్తింది. దూకుడు - ఊసరవెల్లి సినిమాలు ప్రేక్షకుల ముందుకు ఒక్క సమయంలోనే వచ్చాయి. మూడుసార్లు ముచ్చటగా అయిపోయాక మళ్లీ లాంగ్ టైం గ్యాప్ తర్వాత నాలుగోసారి పోటీగా ప్పైడర్ - జైలవకుశలు రిలీజ్ అవుతున్నాయి.
స్పైడర్ - జైలవకుశలు రెండూ భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. రెండింటి మీద అభిమానుల్లో విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. స్పైడర్ ద్విభాషా చిత్రంకాగా.. జై లవకుశ తెలుగులో మాత్రమే వస్తోంది. రెండెంటికీ ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది. ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే.. మొదటి మూడుసార్ల పోటీలో ఏదో ఒక సినిమా మాత్రమే హిట్ టాక్ తెచ్చుకోగలిగింది. రెండోసినిమాకు ఫ్లాప్ ముద్ర తప్పలేదు. ఈసారి ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసి ఇద్దరూ హిట్ కొడతారేమో వేచి చూద్దాం. జై లవ కుశ 21న వస్తుంటే.. స్పైడర్ 27న రిలీజవుతోంది.