త్రివిక్రమ్ ను వదిలించుకునేందుకు మహేష్ ప్లాన్!

Update: 2022-09-08 15:30 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకొని చాలా కాలమైంది. పూర్తి స్థాయిలో అభిమానులు అందరూ కూడా హ్యాపీ అయ్యే సినిమా ఇటీవల కాలంలో అయితే రాలేదు. కాబట్టి మహేష్ బాబు తన తదుపరి సినిమాలతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాపై కూడా మహేష్ నమ్మకంతోనే ఉన్నాడు. ఎందుకంటే ఆ కథ విషయంలో మహేష్ గతంలో ఎప్పుడు లేనంత డౌట్స్ తీసుకువచ్చాడు.

అందుకే త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేసేందుకు చాలా సమయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. అనేకసార్లు స్క్రిప్టులో మార్పులు కూడా చేశారు. ఫైనల్ గా నమ్మకం అనిపించేంతవరకు కూడా మహేష్ షూటింగ్ మొదలుపెట్టలేదు అంటే ఎంత పట్టుదలతో ఉన్నాడు అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమాతో సక్సెస్ అయితే తప్పకుండా వస్తుంది. కాకపోతే అది ఏ రేంజ్ లో ఉండాలి అన్నదే మహేష్ అంచనా వేసుకోవాలి.

అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ కూడా అవ్వాలి. రెండు మూడేళ్లు వృధా అయిన పర్వాలేదు కానీ రాజమౌళి కోసం హార్డ్ వర్క్ చేసి తన మార్కెట్ పెంచుకోవాలని మహేష్ కసిగానే ఉన్నాడు. అయితే ఈ క్రమంలో రాజమౌళి రెడీ అన్నప్పుడు సిద్ధంగా ఉండాలి కాబట్టి త్రివిక్రమ్ ను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. అందుకే మహేష్ కఠినంగా ఉన్న కీలకమైన షెడ్యూల్స్ అన్నిటినీ కూడా ముందే ఫినిష్ చేయించుకోవాలి అని త్రివిక్రమ్ కు సజెస్ట్ చేశాడట.

మొదట కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో పూర్తి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. చాలా తేలిగ్గా అయిపోయే డైలాగ్ సన్నివేశాలు మాత్రం చివర్లో పూర్తిచేసుకుని ముందుగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ షెడ్యూల్స్ ఫినిష్ అవ్వాలి అని ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ కూడా అందుకు తగ్గట్టుగానే రెడీ అవుతున్నాడట.

ఇక ఈ ఏడాది చివరిలోపే సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేయాలని మహేష్ అనుకుంటున్నాడు. ఇక ఆ తర్వాత రాజమౌళి కోసం వర్కౌట్స్ కూడా చేయాల్సివస్తే సిద్ధంగా ఉండాలి అనే ఆలోచనతో ఉన్నాడు. మరి ఈ ప్రణాళిక ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News