మొత్తానికి తెలుగు రాష్ట్రాలను జ్వరంతో ఊగిపోయేలా చేసిన ఎన్నికలు పూర్తయ్యాయి. ఎంత శాతం ఓట్లు పడ్డాయి ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేవి తర్వాత తేలుతాయి కాని ఇవాళ ఇంత హంగామాలోనూ ఒకే ఒక్క సినిమా పండగ చేసుకుంది. అదే మజిలి. అధికారిక ప్రభుత్వ సెలవు కావడంతో ఉదయం 10 లేదా 11 లోపు ఓటు వేసిన జనమంతా మజిలి వైపు వెళ్ళిపోయారు.
ఇది కలెక్షన్స్ లో వచ్చిన మార్పులో స్పష్టంగా కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువ ఉన్న నేపధ్యంలో కొందరు ఎంజాయ్ చేయడానికే వాడుకున్నారు. సినిమాల పరంగా మజిలి తప్ప ఇంకే ఆప్షన్ లేకపోవడం పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడం లాంటి కారణాల వల్ల వసూళ్ళ పరంగా పెద్ద ప్లస్ అయ్యింది
ట్రేడ్ ప్రామాణికంగా తీసుకునే ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో నిన్న మార్నింగ్ షోకు 46 వేల పైచిలుకు కలెక్షన్ రాగా మధ్యాన్నం ఆటకు అది ఏకంగా 76 వేలకు చేరుకుంది. ఈ రోజు పోలింగ్ డే. ఉదయమే 70 వేలు రికార్డు కాగా ఆఫ్టర్ నూన్ షోకు హౌస్ ఫుల్ అయిపోయి బ్లాక్ లో కొనే పరిస్థితి. ఇక ఈవెనింగ్ షో గురించి చెప్పాల్సిన పని లేదు. హాల్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా సెకండ్ షో కూడా మొత్తం బుక్ అయిపోయాయి.
మెయిన్ సెంటర్స్ అన్నింటిలో ఇదే సిచువేషన్. ఇప్పటికే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయిన మజిలి ఇకపై ఇచ్చేవన్ని లాభాలే. అఫీషియల్ గా ఇంకా ఖచ్చితమైన సమాచారం రాలేదు కాని ఫస్ట్ వీక్ కే బిజినెస్ చేసిన 21 కోట్లను రాబట్టిందని ట్రేడ్ టాక్. మొత్తానికి చైతుకి ఎండమావిగా నిలిచిన సక్సెస్ మజిలి రూపంలో ఎడారిలో ఏసిలాగా జాక్ పాట్ కొట్టించింది