టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన్న తాజా చిత్రం 'మేజర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 2008 లో ముంబై లోని తాజ్ హోటల్ పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు శశి కిరణ్ తిక్క తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషన్ ప్రొడక్షన్స్ తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని జూన్ 3న తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషలలో రిలీజ్ చేస్తున్నారు.
సయీ మంజ్రేకర్, శోభిత ధూలిపాళ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీశర్మ నటించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ ఈవెంట్ లని బ్యాక్ టు బ్యాక్ ప్లాన్ చేస్తోంది. ఇటీవల ట్రైలర్ ని విడుదల చేసిన సినిమాపై అంచనాల్ని పెంచేసిన చిత్ర బృందం తాజాగా 'మేజర్'లోని రొమాంటిక్ సాంగ్ కు సంబంధించిన వీడియో ని విడుదల చేసింది.
అడివి శేష్, సయీ మంజ్రేకర్ లపై 'ఓ ఇషా.. 'అంటూ షూట్ చేసిన ఈ పాటని తాజాగా బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ 'మేజర్' సినిమా వెనకున్న పలు ఆసక్తికర ఆంశాలని బయటపెట్టారు. రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. అయితే ఈ క్రమంలో ఈ చిత్ర కథ కోసం తను పడిన శ్రని, సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబంతో తను గడిపిన క్షణాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల్ని కలవాలని, అతనిపై సినిమా కోసం వారిని ఒప్పించాలని చాలా సార్లు ప్రయత్నాలు చేశాం. కానీ సందీప్ ఫాదర్ అందుకు అస్సలు అంగీకరించలేదు. అదే సమయంలో మా టీమ్ నుంచి ఓ అమ్మాయితో ప్రయత్నించాం. అప్పుడు ఓకే చెప్పారు. చాలా సార్లు ప్రయత్నించిన తరువాత మా ప్రయత్నం నచ్చి ఫైనల్ గా మమ్మల్ని కలవడానికి అంగీకరించారు.
'నేను ఫైనల్ గా ఆయనని కలిసిన సందర్భంలో అప్పటికే ఆయనని బాలీవుడ్, మాలీవుడ్ నుంచి చాలా మంది సంప్రదించారట. అయితే వారు చెప్పిన విధానం తనకు నచ్చకపోవడం తో సందీప్ ఫాదర్ ఎవరికీ తన అంగీకారం తెలపలేదని, మా ప్రయత్నం, సందీప్ ఉన్నికృష్ణన్ కథని ఆవిష్కించాలనుకుంటున్న తీరు నచ్చడం వల్లే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆ తరువాత చిత్రీకరణ మొదలు పెట్టాక నన్ను కూడా వారి ఫ్యామిలీ మెంబర్ లా భావించారు. నేను మేజర్ ని కాకపోవచ్చు కానీ వారికి రెండవ కొడుకుని అయ్యాను. సందీప్ ఉన్నికృష్ణన్ కేరళకు చెందిన వ్యక్తి కావడంతో ఆ మహానుభావుడిపై వున్న గౌరవంతో ఈ సినిమాను మలయాళంలోనూ విడుదల చేస్తున్నాం. కమర్షియల్ అంశాలని దృష్టిలో పెట్టుకుని ఇలా చేయడం లేదు' అని తెలిపాడు క్రిష్. మేజర్ మూవీని తెలుగుతో పాటు హిందీలో ఒకే సారి రూపొందించారు. మలయాళంలో మాత్రం డబ్బింగ్ వెర్షన్ ని విడుదల చేస్తున్నారు.