ఒక కుటుంబాన్ని నడిపించడానికి ఎవరో ఒకరు కుటుంబ పెద్దగా బాధ్యతలు తీసుకొని నడిపిస్తూ ఉంటారు. అలానే కొన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న సినీ పరిశ్రమకి కూడా ఇండస్ట్రీని నడిపించే పెద్ద అవసరం ఉంది. మొదటి నుండి కూడా ఎవరో ఒకరు ఈ బాధ్యతలు తీసుకుంటూ సినీ ఇండస్ట్రీలో ఉండే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా దర్శకరత్న దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా ఉంటూ ఇండస్ట్రీలో అందరికీ సమన్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే టాలీవుడ్ లో సమన్యాయం చేసే పెద్దదిక్కుగా ఉంటూ వస్తున్న దాసరి నారాయణరావు మరణంతో ఆ స్థానం ఖాళీగా ఉండిపోయింది. దీంతో ఇండస్ట్రీని ముందుండి నడిపించే వారు లేకపోవడంతో సమస్య వచ్చినప్పుడు పరిష్కరించే దిక్కు లేక టాలీవుడ్ సతమతమవుతోంది. ముఖ్యంగా చిన్న సినిమాలు తీసే నిర్మాతలు దాసరి లేని లోటును బాగా ఫీల్ అవుతున్నారు. పెద్ద సినిమాలను తట్టుకొని చిన్న సినిమాలు అంతో ఇంతో థియేటర్స్ పొందగలిగారంటే అది దాసరి వల్లనే అని అభిప్రాయపడుతుంటారు. అంతేకాకుండా నటీనటులు టెక్నీషియన్స్ జూనియర్ ఆర్టిస్ట్స్ ఇతర సిబ్బంది.. ఇలా సినిమాకి పని చేసే ప్రతి ఒక్కరి సమస్యలు దాసరి దగ్గరకి తీసుకెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనే నమ్మకం అందరిలో కలిగించారు. థియేటర్స్ ని గుప్పింట్లో పెట్టుకుని ఇండస్ట్రీని ఏలుతున్న ఆ నలుగురు సైతం దాసరి జోక్యంతో చిన్న సినిమాలకు థియేటర్స్ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలోకి వచ్చి ఎవరు పెద్దన్న పాత్ర పోషిస్తారనేది ఇప్పుడు ఇండస్ట్రీ జనాల్లో పెద్ద ప్రశ్న.
అయితే గత కొంతకాలంగా ఇండస్ట్రీ విషయాల్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలుగజేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వస్తున్నారు. 'మా' అసోసియేషన్ మెంబెర్స్ మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కూడా ముందుండి పరిష్కారం చూపడానికి ట్రై చేసారు. అంతేకాకుండా కరోనా సమయంలో షూటింగ్స్ లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోడానికి 'కరోనా క్రైసిస్ చారిటీ'ని ఏర్పాటు చేసి ఇండస్ట్రీ ప్రముఖుల నుండి విరాళాలు వసూలు చేసి వారిని అందుకున్నాడు. అంతేకాకుండా ఇండస్ట్రీ సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడుతూ షూటింగులు ప్రారంభించుకోడానికి అనుమతులు రావడానికి కృషి చేసారు. అయితే మెజారిటీ టాలీవుడ్ సినీ ప్రముఖులు చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా అంగీకరించడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ కోసం మీటింగులు ఏర్పాటు చేసి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చాలా మంది బహిరంగంగానే విమర్శించారు. స్టార్ హీరో బాలయ్య సైతం దీనిపై అసహనం వ్యక్తం చేసారు. ఇక బాలయ్య - నాగబాబు వ్యవహారంలో జ్యోక్యం చేసుకుని ఆ వివాదం సర్దుమణిగేలా చేయలేకపోయాడు అనే వారు కూడా లేకపోలేదు.
అంతేకాకుండా చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉంటే బడా నిర్మాతలకు మాత్రమే మేలు జరుగుతుందని చిన్న నిర్మాతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. చిరంజీవి 'గ్యాంగ్ లీడర్'గా ఉంటే చిన్న నిర్మాతల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం లేదని.. ఎందుకంటే పెద్ద సినిమాలు తీసే నిర్మాతలు.. థియేటర్స్ గుప్పిట్లో పెట్టుకుని ఉన్నవారు చిరు కి సన్నిహితంగా ఉంటారని.. అలాంటప్పుడు తమకు చిరు న్యాయం చేస్తాడనే నమ్మకం లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే బాలయ్య - నాగబాబు ఇష్యూ వలన ఇండస్ట్రీలో వర్గపోరు నడుస్తుంది అనే టాక్ వచ్చింది. దీనికి తగ్గట్టే ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఈ మధ్య మీటింగ్స్ చిన్న నిర్మాతలను పక్కన పెట్టి బడా నిర్మాతలను మాత్రమే తీసుకెళ్లడం వలన కూడా వారు చిరు ఇండస్ట్రీ పెద్దగా ఉంటే సమన్యాయం జరుగుతుందని అనుకోవడం లేదని అంటున్నారట. ఇలాంటి నేపథ్యంలో చిరంజీవిని మెజారిటీ టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా ఒప్పుకోవడం లేదని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.