ఫ్యాషన్ పిచ్చి పీక్స్ చేరినట్టే ఉంది వీళ్ల వాలకం చూస్తుంటే..! నేటి పోటీప్రపంచంలో ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా వెరైటీగా కనిపించాలని అనుకున్నారో ఏమో కానీ.. ఈ బృందాన్ని చూస్తున్నారుగా.. ఫ్యాషన్ పిచ్చిని పరాకాష్టకే చేర్చారు ఆ పార్టీలో.
మలైకా అనకొండ డ్రెస్సు .. పూల రంగడు కరణ్ జోహార్ వైట్ అండ్ వైట్ డ్రెస్సు ...మనీష్ మల్హోత్రా పేపర్ మ్యాన్ డ్రెస్సు.. చూస్తుంటే ఈ వెరైటీ ఐటెమ్ నంబర్లు ఏమిటీ? అని కామెంట్ చేస్తున్నారు నెటిజనం.
ఇంతకీ ఇది ఎక్కడ.. ఏ పార్టీలో అంటారా? మొన్ననే కదా బెబో కరీనాకపూర్ తన రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభసందర్భంగా సైఫీనాకి శుభాకాంక్షలు తెలిపేందుకు కిడ్ కి బెబోకి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చేందుకు గ్యాంగ్ మొత్తం పార్టీ పేరుతో ఇలా దిగిపోయారు.
కరీనా.. ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ గత నెలలో పండంటి అబ్బాయికి స్వాగతం పలికారు. కొంత గ్యాప్ తర్వాత బుధవారం నాడు వీరంతా బెబో నవజాత శిశువును సందర్శించారు. గత రాత్రి జరిగిన పార్టీలో మలైకా అరోరా- కరణ్ జోహార్- మనీష్ మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు.
బాంద్రాలోని కరీనా నివాసం వెలుపల మలైకా- కరణ్- మనీష్ మల్హోత్రా భారీ బహుమతులతో ఫోటోలు దిగారు. ఈ పార్టీ లో కరీనా సోదరి కరిష్మా, గౌరీ ఖాన్- మలైకా అరోరా- అమృత అరోరా- మహీప్ కపూర్- సీమా ఖాన్- నటాషా పూనవల్లా పాల్గొన్నారు. ఈ పార్టీకోసమే ప్రత్యేకించి సరికొత్త డిజైనర్ డ్రెస్సుల్ని రూపొందించారట మనీష్. అందులోంచి కరణ్ జోహార్ పార్టీ కోసం చమత్కారమైన విలక్షణమైన దుస్తులను ఎంచుకున్నారు. మలైకా ధరించిన డ్రెస్ చాలా ప్రత్యేకంగా ఉండగా.. పేపర్ ని చుట్టుకున్నట్టు మనీష్ లుక్ ఆకట్టుకుంది.