మ‌త్స్య సుంద‌రికి జెరాక్స్ కాపీలా..

Update: 2015-11-25 11:32 GMT
కెవ్వు కేక .. అంటూ గ‌బ్బ‌ర్‌ సింగ్ లో ఐటెమ్ నంబ‌ర్‌ లో న‌ర్తించింది మ‌లైకా అరోరాఖాన్‌. అంత‌కంటే ముందే ఛ‌య్య ఛ‌య్యా ఛ‌య్యా అంటూ దిల్‌సే మూవీలో ట్రెయిన్ సాంగ్‌ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితం ఈ అమ్మ‌డు. టాలీవుడ్‌ కి అడ‌పా ద‌డ‌పా వ‌చ్చి వెళుతుంటుంది ఈ భామ‌. గొప్ప న‌ర్త‌కిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకుంది. అందుకే 40 ప్ల‌స్ వ‌య‌సులోనూ అమ్మ‌డికి ఐటెమ్ నంబ‌ర్ల‌లో న‌ర్తించే ఛాన్సొస్తోంది. ఇటీవ‌లి కాలంలో స్నేహితురాళ్ల‌తో క‌లిసి విదేశీ బీచ్‌ ల‌లో స‌రిగంగ స్నానాలాడుతూ హ‌ల్‌ చ‌ల్ చేసింది.

అయితే వాట‌న్నిటినీ మించి ఇదిగో ఇలా ఫోటోల‌కు ట్రెడిష‌న‌ల్ అవ‌తార్‌ లో ఫోజులివ్వ‌డం సెన్సేష‌న్ అయ్యింది. అస‌లు ఈవిడేమైనా సాగ‌ర‌క‌న్య‌కు సిస్ట‌రా? మ‌త్స్యాన్ని పోలి క‌నిపిస్తుందే? అనేంత‌గా ఈ డ్రెస్సులో ఒదిగిపోయింది మ‌లైకా. మ‌న్మ‌థ‌రాక్ష‌సి కోసం ప్ర‌త్యేకించి ఈ డిజైన‌ర్ వేర్‌ ని త‌యారు చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. ఆ స‌న్న‌జాజి న‌డుముకు చుట్టేసిన బంగారు వ‌డ్డానం,  వేలికి తొడుక్కున్న ప‌చ్చని ఉంగ‌రం అద‌ర‌హో అన్న‌ట్టే సూట‌య్యాయి. ఆ క‌ల‌ర్ కాంబినేష‌న్ సూప‌ర్బ్‌.

మ‌లైకా ప్ర‌స్తుతం ఝ‌ల‌క్‌దిక‌లాజా రీలోడెడ్‌ కి జ‌డ్జిగా కొన‌సాగుతూ బుల్లితెర వీక్ష‌కుల్ని అల‌రిస్తున్న మ‌లైఖా అరోరాఖాన్ మునుముందు నిర్మాత‌గా భారీ చిత్రాల్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంద‌న్న‌ది తాజా అప్‌ డేట్. ఓ వైపు ఐటెమ్ భామ‌గా - మ‌రోవైపు నిర్మాత‌గా - బుల్లితెర రియాలిటీ షోల‌కు హోస్టుగా ఇన్ని ప‌నులు ఒకే చేత్తో ఎలా చ‌క్క‌బెడుతోందో?
Tags:    

Similar News