‘నువ్ ముట్టుకుంటే నే పట్టుకుంటా’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ తో యమా హుషారుగా చిందేసిన మమతా మోహన్ దాస్ తారక్ ఫాన్స్ కే కాదు ఆ సినిమా చూసిన అందరికీ గుర్తే. స్వతహాగా సింగర్ అయిన మమతా మోహన్ దాస్ పాటలు పాడటంతో పాటు మంచి హీరొయిన్ ఫీచర్స్ ఉండటం వల్ల పలు సినిమాల్లో నటించింది కూడా. వెంకటేష్ చింతకాయల రవి - నాగార్జున కేడి లాంటి సినిమాల్లో తనే మెయిన్ హీరొయిన్. ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తెలుగు పరిశ్రమకు దూరమైన మమతా మోహన్ దాస్ కొన్నాళ్ళు ప్రమాదకరమైన కాన్సర్ తో పోరాడింది. చావు దాకా వెళ్లి వెనక్కు వచ్చిన తన స్ఫూర్తి గురించి పత్రికల్లో చాలా కథనాలు వచ్చాయి. ఇంత గ్యాప్ తర్వాత మరోసారి సౌత్ సినిమాలోకి అడుగు పెడుతోంది మమతా మోహన్ దాస్. అడపాదడపా మలయాళీ సినిమాల్లో కనిపించే మమతా దాదాపు పదేళ్ళు మన వైపు రాలేదు.
ప్రస్తుతం ప్రభుదేవా హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో మమతా మోహన్ దాస్ ఒక కీలక పాత్ర పోషిస్తోంది. అది హీరొయిన్ రోలా లేక ఇంకేదైనా అనే స్పష్టత రావాల్సి ఉంది. మంచి గొంతుతో పాటు చక్కని టాలెంట్ కూడా స్వంతమైన మమతా పాటలకు ఇక్కడ పెద్ద ఫాన్స్ ఉన్నారు. ఒకవేళ తను ఆ వ్యాధి బారిన పడకపోయి ఉంటే ఖచ్చితంగా సింగర్ గా ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించేదే. తెలుగు, తమిళ బాషలలో ఏక కాలంలో నిర్మాణమవుతున్న ఈ సినిమా జానర్ ఏంటనేది బయటికి రాలేదు. అభినేత్రి తర్వాత ప్రభుదేవా కూడా తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఒకరకంగా ఇది తనకు కూడా తెలుగు సినిమాకు కం బ్యాక్ లాంటిదే. మరి ప్రభుదేవా - మమతా మోహన్ దాస్ కాంబో లో వచ్చే ఈ మూవీ ఇంకెన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటుందో వేచి చూడాలి .
ఊమై విజిగల్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మొన్న మార్చ్ 5 న ఊటీలో నిరాడంబరంగా ప్రారంభం అయ్యింది. ఇదే పేరుతో 1986 లో ఒక సూపర్ మూవీ వచ్చింది. ఇది దానికి రీమేక్ కాదని స్పష్టం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తెలుగు వెర్షన్ పేరు ఇంకా డిసైడ్ కావాల్సి ఉంది.