మంచు డాడీ డాటర్.. పిల్ల చేష్టలు

Update: 2016-05-06 16:47 GMT
పిల్లలు ఎంత ఎదిగినా సరే.. పేరెంట్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్లింకా పిల్లలే. అలాగే తాము ఎంత పెద్దవారైనా.. పిల్లల దగ్గరకి వచ్చేసరికి ఆడుకోవడం తల్లిదండ్రులకు కామన్. దీనికి సెలబ్రిటీలు - లెజెండ్ లు లాంటి డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఎవరైనా ఎపుడైనా తమ పిల్లలతో కలిసినపుడు పేరెంట్స్ కూడా చిన్నారుల్లా మారిపోతారని మంచు మోహన్ బాబు మరోసారి ప్రూవ్ చేశారు.

మంచు వారసురాలు లక్ష్మికి ఖాళీ టైం దొరికితే పేరెంట్స్ తో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. తను యాక్టర్ - ప్రొడ్యూసర్ - యాంకర్.. ఇలా ఎన్ని రోల్స్ లో బిజీగా ఉన్నా తండ్రితో టైం స్పెండ్ చేయడం ఆమెకు చాలా ఇష్టం. అలా ఓసారి తన డాడీతో కలిసి ఈ డాటర్ బోలెడంత హంగామా చేసేసింది. అంతే కాదు.. రకరకాల ఫీలింగ్స్ తో నవ్వులు పూయించేసింది మంచు లక్ష్మి. కూతురుతో సమానంగా అదే టైపులో ఫోజులిస్తూ మోహన్ బాబు ఇచ్చిన రియాక్షన్స్ భలే ఉన్నాయి.

తండ్రి కూతుళ్లు అంటూ నాన్నతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ సైట్లలో పోస్ట్ చేసింది మంచు లక్ష్మి. ఏడుస్తున్నట్లుగా ఫేస్ పెట్టడం - పగలబడి నవ్వేయడం - ఆశ్చర్యపోతున్నట్లు ఓ ఫోజ్.. ఇలా రకరకాలు దిగిన ఫోటోలు.. భలే చూడముచ్చటగా ఉన్నాయి. ఏమైనా మంచు డాడీ డాటర్ లు.. పిల్లచేష్టలతో భలే ఆకట్టుకున్నారు.
Tags:    

Similar News