ఎడిక్ట్ అయిపోయాను అంటున్న మంచు హీరో

Update: 2016-07-23 10:59 GMT
ప్రపంచం అంతా అల్లకల్లోలం చేస్తోంది ఒక ప్రక్కన యురోప్ లోని వివిధ దేశాల్లో జరుగుతున్న టెర్రరిస్టుల దాడులైతే.. మరో ప్రక్కన 'పోక్ మాన్ గో' అనే గేముతో అమెరికా అతలాకుతలం అయిపోతోంది. ఈ గేము ఎడిక్షన్లో కొంతమంది విచిత్రమైన పనులు చేస్తుంటే.. ఇదే ముసుగులో కొన్ని క్రయిమ్స్ కూడా జరుగుతున్నాయి. అదంతా ఏమో గాని.. మేము మాత్రం ఎడిక్ట్ అయిపోయాం అంటున్నారు చాలా సెలబ్రిటీలు.

''ఏదో పట్టినట్లు.. ఈరోజు నేను బెంగుళూరు ఎయిర్ పోర్టులో నా పోక్ మాన్ గేమ్ కోసం తిరుగుతూనే ఉన్నాను. గేమ్ మాత్రం అదిరిపోయింది. నాలాగే ఎడిక్ట్ అయిపోయినోళ్లు ఇంకా ఎంతమంది ఉన్నారు??'' అంటూ ట్వీటేశాడు మంచు విష్ణు. ఇంకా ఇండియాలో ఈ గేమ్ అఫీషియల్ గా రాలేదు కాని.. మొన్నటివరకు అమెరికాలో ఉండొచ్చిన మంచు విష్ణు.. అక్కడే ఈ గేమును డౌన్ లోడ్ చేసుకున్నాడట. మొత్తానికి చాలామంది హీరోయిన్లు కేవలం పోక్ మాన్ పై పోస్టులు పెడుతుంటే.. మనోడు మాత్రం ఏకంగా ఎడిక్ట్ అయ్యానంటూ ఒప్పేసుకున్నాడు.

నిజంగానే ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఈ గేముకు భానిసలైపోతున్నారు. త్వరలోనే ఐఫోన్ వర్షన్ ఇండియాలో అఫీషియల్ గా రిలీజవుతుండటంతో.. ఇక అప్పుడు చూడాలి రచ్చ ఎలా ఉండోబోతోందో!!


Tags:    

Similar News