ఇంకో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి.. కొన్ని రోజులుగా ప్రమోషన్లు కూడా కొంచెం గట్టిగా చేస్తోంది చిత్ర బృందం. కానీ ఉన్నట్లుండి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా నిన్న ప్రకటన వచ్చింది. ఈ వారం కుదరకపోతే వచ్చే వారమో.. లేదా ఆ తర్వాతి వారాల్లోనో సినిమా రిలీజవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఇప్పుడిప్పుడే రాదని వెల్లడైంది. స్వయంగా మంచు విష్ణునే ఆ దిశగా సంకేతాలిచ్చాడు. ‘ఆచారి అమెరికా యాత్ర’ వాయిదా పడటం దురదృష్టకరమని.. బహుశా ఈ చిత్రం వేసవిలో విడుదల కావచ్చని అతను ట్వీట్ చేశాడు.
మరీ కొన్ని నెలల పాటు సినిమా వాయిదా పడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. సంక్రాంతి సినిమాలు ‘జై సింహా’.. ‘గ్యాంగ్’ ఇప్పటికీ చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లలో నడుస్తుండటం.. ‘భాగమతి’కి భారీగా స్క్రీన్లు అట్టిపెట్టేయడం.. ‘పద్మావత్’ హిందీ వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్సుల్లో కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజవుతుండటం.. ‘ఆచారి అమెరికా యాత్ర’కు ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కలేదని.. అందుకే వాయిదా వేశారని అంటున్నారు. ఫిబ్రవరి 9న విష్ణు తండ్రి మోహన్ బాబు సినిమా ‘గాయత్రి’ విడుదలవుతున్న నేపథ్యంలో తర్వాతి వారాల్లోనూ ‘ఆచారి అమెరికా యాత్ర’ను విడుదల చేయడానికి వీల్లేకపోయింది. ఫిబ్రవరి ద్వితీయార్ధం నుంచి నెలకు పైగా సినిమాలు ఆడటం కష్టం. అది అన్ సీజన్. అందుకే కొంచెం ఆగి వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని ఫిక్సయినట్లున్నారు.