మెగా మేనల్లుడు సాయిధరమ్ కథానాయకుడి గా మారుతి దర్శకత్వం లో `ప్రతి రోజు పండగే` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెండింగ్ పనులు శర వేగంగా పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రచారం లో వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. పోస్టర్లు లిరికల్ వీడియోల తో వేడెక్కిస్తున్నారు. తాజాగా ఓ లిరికల్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసారు. `బావా మా అక్క ను సక్కగా సూస్తావా?` అంటూ సాగే పాట టీజర్ అంతర్జాలంలో వైరల్ అయ్యింది. అయితే ఈ ప్రమోషన్ రొటీనే కానీ.. కొత్తగా ఏం ఉంది? అంటే చాలానే ఉంది. ఈ పాట టీజర్ లో రాశీ ఖన్నా ఓ పల్లె పట్టు సుందరిగా దర్శనమిస్తోంది. రాశీ అక్కను ఆట పట్టించే చెల్లెమ్మ గా ఓ అమ్మాయి (ఎడమవైపు) కనిపిస్తోంది చూశారా?. తను మరెవరో కాదు డైరెక్టర్ మారుతి కుమార్తె.
భరత నాట్య కళాకారిణి గానూ తళుక్కున మెరిసిన ఆ అమ్మాయి పేరు అభీష్ట. ఇలా తనని చూడగానే తండ్రికి తగ్గ తనయురాలు అని పొగిడేయకుండా ఉండలేం. సినిమాలంటే అభీష్ట కు ఆసక్తి. పైగా నాట్యం లో ప్రావీణ్యం ఉంది.. పైగా తనకు తండ్రిలానే చిత్రలేఖనం లోనూ ప్రావీణ్యం ఉందట. అందుకే మారుతి తన కుమార్తెను ఈ చిత్రంతో పరిచయం చేసినట్లు తెలుస్తోంది. రాశీ ఖన్నా ముగ్గురు చెల్లెళ్ల లో తను ఎంతో యాక్టివ్ గా ఉంటుందట. ఇక మారుతికి ఇద్దరు సంతానం. కుమార్తె ఆర్ట్ (డ్రాయింగ్) పరంగా శిక్షణ పొందుతుంటే.. కుమారుడు డ్రమ్స్ సహా ఇండియన్ క్లాసిక్ .. పాశ్చాత్య బాణీల్ని నేర్చుకుంటున్నారట. అంటే భవిష్యత్ లో మారుతి ఇద్దరి పిల్లల్ని సినిమా రంగంలోకి తీసుకొచ్చే అవకాశం స్పష్టం గా కనిపిస్తోంది.
ఒక్క మారుతి మాత్రమే కాదు.. ఈ రంగంలో ఎందరో తమ వారసుల్ని పరిచయం చేసారు. అందులో చాలామంది పెద్ద స్థాయిలోనే రాణించారు. ఇక మారుతి కి అల్లు కాంపౌండ్ అండదండలు ఉన్నాయి. ఆ క్రమం లోనే వారసుల్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లే ఛాన్సుంటుంది. అయితే తండ్రిలా స్వయం కృషితో పట్టుదల కసితో ఎదగాలన్న పంతం ఉంటేనే ఇక్కడ రాణించడం సాధ్యం. మరి మారుతి వారసులు డాడ్ లోని ఆ క్వాలిటీని దృష్టి లో పెట్టుకుని అంత పట్టుదల తో వస్తారేమో చూడాలి.