మారుతి ఇప్పుడు మాంఛి జోరుమీదున్నాడు. గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' సినిమాను ప్లాన్ చేసుకున్న ఆయన, ఆ సినిమాతో సెట్స్ పైకి వెళ్లాడు. యూవీ క్రియేషన్స్ - గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా షూటింగుకు వెళ్లింది. కొంత షూటింగు చేసిన తరువాత కరోనా ఉద్ధృతి పెరగడంతో, ఆ షూటింగు ఆగిపోయింది. అయితే మారుతి ఆ సమయాన్ని వేస్టు చేయకుండా, 'మంచిరోజులు వచ్చాయి' అనే చిన్న ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లి చకచకా అవ్వగొట్టేశాడు. చాలా తక్కువ రోజులలో సైలెంట్ గా షూటింగు జరుపుకున్న ఆ సినిమా ఇప్పుడు సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ చిరంజీవితో తన సినిమా ఉండనున్నట్టు చెప్పి షాక్ ఇచ్చాడు. సీనియర్ స్టార్ హీరోలలో ఒక్క వెంకటేశ్ తో మాత్రమే మారుతి సినిమా చేశాడు. 'బాబు బంగారం' టైటిల్ తో వచ్చిన ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. అలాంటి మారుతి ఒక్కసారిగా ఈ బాంబ్ పేల్చాడు. చిరంజీవికి తాను ఒక లైన్ చెప్పాననీ, అది ఆయనకి నచ్చిందని అన్నాడు. మెహర్ రమేశ్ .. బాబీలాంటివారితోనే చిరంజీవి పెద్ద ప్రాజెక్టులు చేయడానికి ఒప్పుకున్నారు గనుక, మారుతి మాటలను హండ్రెడ్ పెర్సెంట్ నమ్మొచ్చు.
ఆ షాక్ నుంచి అంతా తేరుకుంటూ ఉండగా ఇప్పుడు మరో వార్త ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది. ప్రభాస్ కి కూడా మారుతి ఒక లైన్ వినిపించాడనీ .. అది ఆయనకి బాగా నచ్చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రభాస్ తో సినిమా అంటే పాన్ ఇండియా సినిమా అనుకోవలసిందే. చిరంజీవి విషయానికి వస్తే ఆయన 'గాడ్ ఫాదర్' .. 'భోళా శంకర్' .. 'వాల్తేర్ వీర్రాజు' ప్రాజెక్టులను ఒకదాని తరువాత ఒకటిగా పూర్తి చేస్తూ రావాలి. అందుకు చాలానే సమయం పడుతుంది. ఆ ప్రాజెక్టుల తరువాతనే మారుతి ఆయనను వెంటబెట్టుకుని తన సెట్స్ పైకి తీసుకెళ్లగలడు.
ఇక ప్రభాస్ విషయానికి వస్తే రీసెంట్ గా 'ఆది పురుష్'లో తన పోర్షన్ ను పూర్తి చేశాడు. 'సలార్' సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత ఆయన నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ చేయడానికి రంగంలోకి దిగవలసి ఉంటుంది. ఈ సినిమా చేస్తూనే ఆయన సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చేయనున్నాడు. ప్రభాస్ ను మారుతి ఒప్పించడం నిజమే అయితే ఆ ప్రాజెక్టు ఇక్కడ ఎంట్రీ ఇస్తుంది. ఈ లోగా మారుతి ఓ మాదిరి బడ్జెట్ సినిమాలు రెండో .. మూడో చేసుకోవచ్చు. ఏదేవైనా మారుతికి 'మంచి రోజులు వచ్చాయి' అనే అనిపిస్తోంది.