రెండు రోజుల క్రితం కరోనా విపత్తు నేపథ్యంలో ప్రధాని రిలీఫ్ ఫండ్ కు తనవంతు సాయంగా 25 కోట్ల రూపాయల విరాళంను అందించి రియల్ హీరో అనిపించుకున్న అక్షయ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆయన స్వయంగా కారును డ్రైవ్ చేస్తూ భార్య ట్వింకిల్ ఖన్నాను హాస్పిటల్ కు తీసుకు వెళ్లాడు. ముంబయి రోడ్లపై అక్షయ్ కారు డ్రైవ్ చేస్తున్న వీడియోను ట్వింకిల్ ఖన్నా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తన కాలు ప్యాశ్చర్ అవ్వడం వల్ల హాస్పిటల్ కు వెళ్తున్నట్లుగా తన కాలును చూపించడంతో పాటు అక్షయ్ మాస్క్ ధరించి కారును డ్రైవ్ చేస్తున్న వీడియోను ట్వింకిల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో రోడ్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయంటూ ఆమె రోడ్లను చూపిస్తూ చెప్పుకొచ్చింది. తనకు కాలు ప్యాశ్చర్ అవ్వడం వల్ల హాస్పిటల్ కు వెళ్తున్నాను. నాకేమీ కరోనా పాజిటివ్ లేదని కూడా ట్వింకిల్ ఖన్నా కామెంట్ చేసింది.
కాలుకు ప్యాశ్చర్ ఎలా అయ్యిందనే విషయాన్ని మాత్రం ట్వింకిల్ ఖన్నా తెలియజేయలేదు. ఆమెకు గతంలోనే ఈ ప్యాశ్చర్ అయినట్లుగా ఉంది. ఇప్పటికే ఆమె కాలుకు పెద్ద కట్టు కట్టుకుని ఉంది. దాంతో ఆమె చెకప్ కు వెళ్లి ఉంటుందని కొందరు అనుకుంటున్నారు. ఇక ఇటీవల తన భర్త అక్షయ్ కుమార్ భారీ మొత్తంలో డొనేట్ చేయడంపై స్పందిస్తూ నా భర్త నేను గర్వపడేలా చేశాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరి ప్రశంసలు దక్కించుకుంది.Full View
తన కాలు ప్యాశ్చర్ అవ్వడం వల్ల హాస్పిటల్ కు వెళ్తున్నట్లుగా తన కాలును చూపించడంతో పాటు అక్షయ్ మాస్క్ ధరించి కారును డ్రైవ్ చేస్తున్న వీడియోను ట్వింకిల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో రోడ్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయంటూ ఆమె రోడ్లను చూపిస్తూ చెప్పుకొచ్చింది. తనకు కాలు ప్యాశ్చర్ అవ్వడం వల్ల హాస్పిటల్ కు వెళ్తున్నాను. నాకేమీ కరోనా పాజిటివ్ లేదని కూడా ట్వింకిల్ ఖన్నా కామెంట్ చేసింది.
కాలుకు ప్యాశ్చర్ ఎలా అయ్యిందనే విషయాన్ని మాత్రం ట్వింకిల్ ఖన్నా తెలియజేయలేదు. ఆమెకు గతంలోనే ఈ ప్యాశ్చర్ అయినట్లుగా ఉంది. ఇప్పటికే ఆమె కాలుకు పెద్ద కట్టు కట్టుకుని ఉంది. దాంతో ఆమె చెకప్ కు వెళ్లి ఉంటుందని కొందరు అనుకుంటున్నారు. ఇక ఇటీవల తన భర్త అక్షయ్ కుమార్ భారీ మొత్తంలో డొనేట్ చేయడంపై స్పందిస్తూ నా భర్త నేను గర్వపడేలా చేశాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరి ప్రశంసలు దక్కించుకుంది.