కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం సినీ ప్రముఖులను కూడా ఇబ్బంది పెడుతోంది. గత ఏడాది ఎంతో మంది సినీ ప్రముఖులు కరోన బారిన పడి మళ్లీ కోలుకున్నారు. కొందరు ఈ లోకాన్ని విడిచి వెళ్లి దుఖంను మిగిల్చారు. సెకండ్ వేవ్ సందర్బంగా మళ్లీ సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. బాలీవుడ్.. కోలీవుడ్.. టాలీవుడ్ ఇలా అన్ని భాషలకు సంబంధించిన సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఆందోళన కలిగిస్తున్నారు. తాజాగా మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరియు దంగల్ బ్యూటీ ఫాతిమ కరోనా పాజిటివ్ అంటూ ప్రకటించారు.
మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశాడు. తనకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. కొన్ని రోజులుగా తనతో కలిసిన వారు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అలాగే ప్రస్తుతం లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నాడు. లోకేష్ కనగరాజ్ కరోనా బారిన పడటం పట్ల ఆయన అభిమానులు మరియు సినీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దంగల్ బ్యూటీ ఫాతిమా సోషల్ మీడియాలో నాకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం వైధ్యుల పర్యవేక్షణతో హోం క్వారెంటైన్ లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు కూడా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని వీరిద్దరు చెప్పుకొచ్చారు.