తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీస్ లో ‘మాతృదేవోభావ’ ఒకటి. 1991 లో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. యావత్ తెలుగు మహిళా ప్రేక్షకలోకం మొత్తాన్ని థియేటర్ కు కదిలించింది. ఈ చిత్రం విడుదలై 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. మరోసారి ఈ సినిమాను రీమేక్ చేయాలని యోచిస్తున్నారు మేకర్స్.
వాస్తవానికి ఈ చిత్రం మొదటిసారి కూడా రీమేకే. మలయాళ హిట్ మూవీ ‘ఆకాషదూతు’ను తెలుగులో ‘మాతృదేవోభవ’ పేరుతో రీమేక్ చేశారు. కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ చిత్రాన్ని.. దర్శకుడు అజయ్ కుమార్ తెరకెక్కించారు. అయితే.. రామారావు మరోసారి అజయ్ కుమార్ తోనే ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
నిర్మాత కె.ఎస్.రామారావు, దర్శకుడు అజయ్ కుమార్ ఇటీవల ‘తెరవెనుక కథలు’ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. స్టార్ హీరోయిన్ నయనతారతో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఉందని చెప్పారు. అనుష్క, కీర్తి సురేష్ ను కూడా అనుకున్నట్టు చెప్పారు.
అయితే.. వీరు టాప్ స్టార్స్ గా వెలుగొందుతున్నారు కాబట్టి.. పారితోషికం భారీగా డిమాండ్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఆయన తక్కువ బడ్జెట్ తో సినిమాను రిమేక్ చేసే యోచనలో ఉన్నారు. మరి, ఏ హీరోయిన్ తో చేస్తారు? ఎప్పుడు మొదలు పెడతారు? అన్నది చూడాల్సి ఉంది.