మార్షల్ ఆర్స్ట్ కోసం మహేష్ చైనాకా?
సినిమాకి సంబంధించి కొంత మార్షల్ ఆర్స్ట్ పై కూడా బేసిక్ ట్రైనింగ్ అసవరమని భావించి జక్కన్న చైనాకి పంపిస్తున్నాడుట.
ఎస్ ఎస్ ఎంబీ 29 కోసం సూపర్ స్టార్ మహేష్ కొంత ట్రైనింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి అదేశాల మేరకు జపాన్ లో కొన్ని రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అటుపై ఆఫ్రికాలోని మసాయి-పిగ్మీస్ తెగల మధ్య బేసిక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఓ 20 రోజుల పాటు ఆప్రికన్ తెగల మధ్య మహేష్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మహేష్ చైనా దేశానికి కూడా వెళ్తున్నడుట.
సినిమాకి సంబంధించి కొంత మార్షల్ ఆర్స్ట్ పై కూడా బేసిక్ ట్రైనింగ్ అసవరమని భావించి జక్కన్న చైనాకి పంపిస్తున్నాడుట. ఈనెల మిడ్ లోనే మహేష్ చైనా ప్రయాణం ఉంటుందని సమాచారం. అక్కడ ప్రత్యేకమైన నిపుణుల ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ లో శిక్షణ ఉంటుందని వార్తలొస్తున్నాయి. మహేష్ తో పాటు రాజమౌళి కూడా అటెండ్ అవుతారని అంటున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే మార్షల్ ఆర్స్ట్ మాస్టర్లు ట్రైనింగ్ ఇవ్వనున్నారుట.
ఇదే నిజమైతే మహేష్ ని ఏ రేంజ్ లో సానబెడుతున్నారో? ఇక్కడే అర్దమవుతుంది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఇన్ని రకాల ట్రైనింగ్ లు అంటే చిన్న విషయం కాదు. ఎంతో ఓపికతో పూర్తి చేయాల్సిన శిక్షణలవన్నీ. సినిమా కోసం మహేష్ ఏమాత్రం ఆలోచించరు. కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. జపాన్, మసాయి తెగల మధ్యనే గడిపిన మహేష్ చైనా ట్రైనింగ్ పూర్తి చేయాలడా? ఏమీ అంటున్నారు అభిమానులు.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా అడ్వెంచర్ థ్రిల్లర్ కావడంతోనే ఇన్ని రకాల ట్రైనింగ్ లు అవసరం అవుతున్నాయి. మేజర్ పార్టు షూటింగ్ ఆప్రికన్ అడవుల్లోనే ఉంటుందని వార్తలొస్తున్నాయి. అటు రామోజీ ఫిలిం సిటీ సహా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ సెట్లు నిర్మిస్తున్నారు.