నా మాట సూటిగా.. బాట ముక్కు సూటిగా..!

నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.

Update: 2025-01-10 17:22 GMT

నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా హీరోయిన్స్ గా నటించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అసలైతే గురువారం అనంతపురంలో ప్లాన్ చేయగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్స్ కోసం జరిగిన తొక్కిసలాట వల్ల ఈవెంట్ వాయిదా వేసుకున్నారు.

ఇక రిలీజ్ ముందు ఈవెంట్ చేయాలని లేటెస్ట్ గా హైదరాబాద్ లోనే చిత్ర యూనిట్ సమక్షంలోనే ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో నట సింహం నందమూరి బాలకృష్ణ తన ఎనర్జిటిక్ స్పీచ్ తో అలరించారు. ముందు మైక్ అందుకున్న బాలయ్య తిరుమల తొక్కిసలాట ఘటన ఎంతో కలచివేసిందని అన్నారు. ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఈ ఘటన వల్ల అనంతపురంలో చేయాల్సిన వేడుక రద్దు చేశామని అన్నారు.

నా అభిమానులు క్రమశిక్షణ కలిగిన సైనికులని అన్న బాలయ్య మా నిర్ణయాన్ని వారు గౌరవించాలని అన్నారు. ఇన్ని లక్షల కోట్లమంది అభిమానులను పొందడం పూర్వ జన్మ సుకృతమని అన్నారు. ఈ సందర్భంగా జన్మనిచ్చిన తండ్రి, గురువు, దైవం అయిన నందమూరి తారక రామారావుకి కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ. నన్న గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఆయన మాదిరిగానే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తున్నానని గుర్తు చేశారు.

తాను పోషించిన పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. అఖండ, వీరం సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలను ఆదరించారు. అప్పట్లో ఆదిత్య 369 లో నేను చేసిన కృష్ణదేవరాయల పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు బాలకృష్ణ. ఐతే అలాంటి పాత్ర మళ్లీ చేయాలనే ఆలోచనతోనే డాకు మహారాజ్ కథ అచ్చింది. రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. నా నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అందుకు తగినట్టుగానే ట్రైలర్ ఉంది. దర్శకుడు బాబీ, కెమెరా మెన్ విజయ్ కన్న ప్రాణం పెట్టి పని చేశారని అన్నారు బాలకృష్ణ.

థమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అఖండ తరహాలో మరోసారి అద్భుతమైన సంగీతం ఇచ్చాడని అన్నారు. ప్రతిభ గల కథానాయికలు ప్రయా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ మంచి పాత్రలు చేశారు. యానిమల్ రాకముందే బాబీ డియోల్ ని ఈ సినిమాకు తీసుకున్నాం. ఆయన రోల్ చాలా బాగుంటుందని అన్నారు బాలయ్య. సంక్రాంతికి నా సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ఈ సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ కూడా ఘన విజయం సాధిస్తుందని మీరు ఎంత ఊహించుకుంటున్నారో దానికి మించే ఈ సినిమా ఉంటుందని అన్నారు బాలయ్య.

నా మాట సూటిగా ఉంటుంది.. నా బాట ముక్కుసూటిగా ఉంటుంది.. నాకు నేనే పొగరు.. నాకు నేనే ధైర్యం.. ఒకరి కీర్తి నేను మొయ్యను.. నన్ను నేను మలచుకున్న మహారాజ్ ని నేను అంటూ ఫ్యాన్స్ ని ఉత్తేజపరచే స్పీచ్ తో అలరించారు బాలకృష్ణ.

Tags:    

Similar News