మనీష్ పాండే-అశ్రిత శెట్టి విడిపోతున్నారా?
కొన్ని రోజులుగా క్రికెటర్ యుజవేంద్ర చాహల్-ధన శ్రీ వర్మలు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
కొన్ని రోజులుగా క్రికెటర్ యుజవేంద్ర చాహల్-ధన శ్రీ వర్మలు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ ఈ ప్రచారాన్ని చాహల్ గానీ, శన శ్రీ గానీ ఖండించలేదు. దీంతో వీరిద్దరు వేరవ్వడం దాదాపు ఖాయమే నంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో క్రికెట్ జోడీ కూడా విడాకులకు రెడీ అవుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. మనీష్ పాండే- అశ్రిత శెట్టి విబేధాలతో వేరవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయింది.
తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను డిలీట్ చేయడంతో, అన్ ఫాలో చేసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రచారంపై ఇద్దరు అధికా రికంగా ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరి ఈ ప్రచారంలో నిజమెంత? అన్నది తెలియాల్సి ఉంది. మనీష్ పాండే -అశ్రిత శెట్టి 2019లో వివాహం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన అశ్రిత కోలీవుడ్ చిత్రాల్లో నటించింది. వివాహం అనంతరం మనీషా పాండేకు మద్దతుగా స్టేడియంలో కేరింతలు కొట్టింది.
కానీ ఐపీఎల్ 2024లో మనీష్ స్టేడియంలో కనిపించలేదు. మనీష్ పాండే ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగంగా ఉన్నాడు. ఆ జట్లు టైటిల్ కూడా గెలిచింది. అప్పుడు కూడా అశ్రిత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయలేదు. దీంతో అప్పటి నుంచే ఇద్దరి మధ్యా విబేధాలు నడుస్తున్నాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఏది ఏమైనా సెలబ్రిటీ-క్రికెటర్ల మధ్య విడాకుల కథనాలు అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. నూరేళ్ల పాటు కలిసి జీవించాల్సిన దంతపతులు విడాకులతో మధ్యలోనే ఆ బంధానికి పుల్ స్టాప్ పెట్టడంతో వివాహ వ్యవస్త మరింత బలహీనంగా మారుతుందంటూ ఆందోళన చెందుతున్నారు. ధాంపత్య జీవితంలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ లాంటి మాజీ స్టార్ ప్లేయర్లు స్పూర్తిగా నిలుస్తున్నా? నవతరం ప్లేయర్లు మాత్రం వాళ్ల దారిలో వెళ్లలేకపోతున్నారనే విమర్శల పాలవుతున్నారు.