మీటూ : చిన్న పిల్లనని కూడా చూడకుండా

Update: 2019-11-02 11:06 GMT
గత ఏడాది బాలీవుడ్‌ స్టార్స్‌ కు మీటూ దెబ్బ బలంగా తలిగింది. ఎంతో మంది పేరున్న ప్రముఖులకు మీటూ ఎఫెక్ట్‌ పడింది. ప్రముఖ స్టార్స్‌ విమర్శల పాలయ్యారు. మీటూ అంటూ ఎంతో మంది లేడీ సెలబ్రెటీలు గతంలో తమకు జరిగిన అన్యాయంను చెప్పుకొచ్చారు. ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్‌ పై ఎంతో మంది సింగర్స్‌ ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మరో ప్రముఖ సింగర్‌ శ్వేతా పండిట్‌ కూడా అను మాలిక్‌ పై సంచలన ఆరోపణలు చేసింది.

15 ఏళ్ల వయసులోనే శ్వేతా పండిట్‌ సింగర్‌ గా అవకాశాల కోసం పలువురు సంగీత దర్శకుల వద్దకు వెళ్లిందట. ఆ సమయంలోనే అను మాలిక్‌ వద్దకు తాను వెళ్లాను అని.. ఆ సమయంలో ఆయన నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆరోపించింది. చిన్న పిల్లనని కూడా చూడకుండా నన్ను లైంగికంగా వేదించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. అతడు అవకాశం ఇచ్చేందుకు అనేక కండీషన్స్‌ పెట్టాడని అప్పటి జ్ఞాపకాలను శ్వేతా నెమరవేసుకుంది.

దాదాపు 20 సంవత్సరాల తర్వాత శ్వేతా పండిట్‌ ఈ విషయాన్ని బయటకు వెళ్లడించడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. కొందరు నెటిజన్స్‌ ఈమెకు మద్దతు తెలుపుతుంటే మరి కొందరు మాత్రం ఇంత కాలం ఏం చేశారంటూ రివర్స్‌ కౌంటర్స్‌ వేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తి మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. కాని అప్పుడే అతడి చెంప పగులకొట్టి ఉంటే బాగుండేది. అలా చెస్తే కెరీర్‌ నాశనం అవుతుందని మీరు అనుకున్నారా అంటూ ప్రశ్నించాడు.

అతడి కామెంట్స్‌ కు స్పందించిన శ్వేతాపండిట్‌ నేను సింగర్‌ 20 ఏళ్ల నుండి కొనసాగుతున్నాను. ఇప్పుడు నేను ఆ విషయాన్ని చెప్తేనే చాలా మంది నన్ను తిడుతున్నారు. అలాంటిది అప్పుడే నేను ఆ విషయాన్ని చెప్తే ఏం జరిగి ఉండేదో నేను అర్థం చేసుకోగలను అంటూ అతడికి సమాధానం ఇచ్చింది. శ్వేతాపండిట్‌ మీటూ ఆరోపణలతో అనుమాలిక్‌ మరింత కష్టాల్లో పడ్డట్లయ్యింది.
Tags:    

Similar News