అభిమాన దేవుళ్లు గేటు బ‌య‌టేనా?

Update: 2018-12-27 13:17 GMT
ఆడియోలు .. ప్రీరిలీజ్‌ ఫంక్ష‌న్ల వేళ మ‌న స్టార్ హీరోల పొగ‌డ్త‌ల్లో కామ‌న్ గా ఉండే పాయింట్ `అభిమానులే దేవుళ్లు`. అభిమానులు లేనిదే మేం లేం! అయితే అదే అభిమానులు త‌మ సినిమాల ఆడియో ఫంక్ష‌న్ల కోసం పాసులు కావాలి దేవుడా అని అడుక్కోవాలా?  పాసులు ఇచ్చాక కూడా వెన్యూ గేటు బ‌య‌టే బౌన్స‌ర్ల‌ తో మెడ ప‌ట్టించుకుని గెంటించుకోవాలా?  ప్ర‌స్తుతం ఇదో పెద్ద చిక్కు ప్ర‌శ్న‌. ప్ర‌తిసారీ పెద్ద హీరోల సినిమాల వేడుక‌లు జ‌రుగుతున్నాయంటే ఇదో నిరంత‌ర‌ తంతుగా మారిపోయింద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

బ‌డా హీరోల ఫంక్ష‌న్ల‌ కు సుదూర తీరాల నుంచి అభిమానులు హైద‌రాబాద్‌ కు చేరుకుంటారు. ఇక్క‌డికి వచ్చాక పాస్ లు అంద‌క ఉసూరు మంటూ తిరిగి వెళ్లిపోయేవాళ్లు ఉంటారు.. అలానే పాస్ అందాక కూడా ఆడియో ఈవెంట్ గేటు దాటి లోనికి వెళ్ల‌లేరు. అప్ప‌టికే పోలీసుల జులుం ఓ రేంజులో ఉంటుంది బ‌య‌ట‌. అయితే దీనిని ఎప్ప‌టికీ స‌ద‌రు స్టార్ హీరోలు గుర్తించ‌లేరు. స‌రికదా తాము దేవుళ్లు అని పిలిచే ఆ అభిమానుల్ని లోప‌లికి పిలిచేందుకు ఏర్పాట్లు కూడా స‌రిగా చేయ‌లేరు.

నేటి సాయంత్రం `హైద‌రాబాద్ - యూస‌ఫ్ గూడ` పోలీస్ గ్రౌండ్స్ లో జ‌రుగుతున్న విన‌య విధేయ రామా ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఏకంగా ఏపీ - తెలంగాణ‌లోని 31 జిల్లాల నుంచి అభిమానులు విచ్చేస్తున్నారు. అయితే ఇందులో ప్ర‌ధాన‌మైన అభిమాన సంఘాల నాయ‌కుల‌కు మాత్ర‌మే పాస్ లు ద‌క్కాయ‌ని తెలుస్తోంది. చాలా మంది అభిమానులు ఇంకా ఇంకా పాస్‌ల కోసం వేచి విసిగిపోయార‌న్న స‌మాచారం ఉంది. ఇక చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ ఏరియాలో పాస్ ల కోసం తిరిగి, వేచి చూసి వెళ్లిపోయే మెగాభిమానులు ఉన్నార‌న్న మాట వినిపిస్తోంది. దాదాపు 6 వేల మంది మెగా అభిమానులు ఈ ఈవెంట్ కోసం హైద‌రాబాద్ కు చేరుకున్నారు. ఇందులో కేవ‌లం తెలుగు రాష్ట్రాలే కాదు, ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి అభిమానులు విచ్చేశార‌ని తెలుస్తోంది. అయితే మెగా ఈవెంట్ల‌కు ఇప్పుడే ఈ స‌మ‌స్య కాదు. ప్ర‌తిసారీ ఇదే స‌మ‌స్య‌. అయితే రావొద్ద‌న్న అభిమానులు కూడా వ‌చ్చి ర‌చ్చ చేయ‌డంతోనే ఇలా జ‌రుగుతోంద‌ని చెబుతుంటారు. మ‌రి ఈ స‌మ‌స్య‌కు సులువైన ప‌రిష్కారం ఏదీ లేదా?  ప్ర‌తిసారీ అభిమానులు ఇలా ఇబ్బ ంది ప‌డాల్సిందేనా? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. మ‌రి దీనికి ప‌రిష్కారం క‌నుగొంటారా  లేదా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News