కొడుకు పెళ్లిపనులు చూస్తుంటే మెగాబ్రదర్ ఫుల్ రిలాక్స్
మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల తాను వలచిన సఖుడు చైతన్యను పెళ్లాడేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆగస్టులో ఐజీ కుమారుడు చైతన్యతో నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 9 న గ్రాండ్ వెడ్డింగ్ జరుగుతుంది. ఈ వివాహం ఉదయ్ పూర్ లోని విలాసవంతమైన ప్యాలెస్ లో జరగనుందని ఇప్పటికే రివీలైంది.
నిహారిక తనకు ఎంతో ఇష్టమైన ఉదయపూర్ లో వివాహం చేసుకోవాలని ప్రతిపాదించడం ఆలస్యం ప్రఖ్యాత వెన్యూ ‘ది ఒబెరాయ్ ఉదైవిలాస్ ప్యాలెస్’ను లాక్ చేసేశారు. మెగా కుటుంబం మొత్తం కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు శ్రేయోభిలాషులు ఘనమైన వివాహానికి హాజరవుతారు. కరోనా పరీక్షల అనంతరం అతిథుల్ని పెళ్లి వేడుకకు ఆహ్వానిస్తారు.
వేదిక వద్దకు నాగబాబు సహా వరుణ్ తేజ్ వారం ముందే వెళతారట. వీరు వివాహానికి అతిథులను స్వాగతిస్తారు. పెళ్లికి మూడు రోజుల ముందు కొన్ని గొప్ప వేడుకల్ని ప్లాన్ చేస్తారు. అన్నయ్య చిరంజీవి ఓవరాల్ గా పర్యవేక్షకులుగా ఉంటారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ -రామ్ చరణ్- అల్లు అర్జున్- సాయి ధరం తేజ్ తదితరులు నిహారిక చైతన్యల వివాహ కార్యక్రమానికి హాజరవుతారు.
ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. అసలు ఈ పెళ్లి పనులన్నిటినీ నడిపిస్తున్న అసలు పెళ్లి పెద్ద ఎవరు? మార్గదర్శనం చేసే నిర్ధేశకుడు ఎవరు? అంటే.. నాగబాబు స్వయంగా అన్నీచూసుకుంటున్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే. అసలు మెగా బ్రదర్ కి ఎలాంటి కష్టం శ్రమ లేకుండా అన్నిటినీ తనే చూసుకుంటున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. డాడీకి అన్నీ తానే అయ్యాడు. ఉదయ్ పూర్ ప్యాలెస్ ని లాక్ చేసింది అతడే. అలాగే అతిథులకు సంబంధించిన ప్రతిదీ తనే డిజైన్ చేస్తున్నాడు. పెళ్లి ప్రశాంతంగా హుందాగా జరిగేందుకు చేయాల్సిన సకల ఏర్పాట్లు తనే చూసుకుంటున్నాడట. దీంతో నాగబాబు ఫుల్ రిలాక్స్ డ్ గా ఉన్నారని చెబుతున్నారు. మొత్తానికి వరుణ్ లోని వెడ్డింగ్ ప్లానర్ అలా కుటుంబానికి కీలక సమయంలో చేదోడువాదోడుగా మారాడన్నమాట. కొడుకు ఉంటే కలిసి వచ్చేది ఇలాంటి సందర్భాల్లోనే మరి.