దివంగత యూట్యూబ్ ఇంటర్వ్యూయర్ TNR ప్రశ్నల సరళి గురించి తెలిసిందే. ప్రాంక్లీ విత్ టీఎన్ ఆర్ ప్రోగ్రామ్ తో ఫేమస్ అయిన టీఎన్నాఆర్ దాదాపు 150 మందికి పైగానే సెలబ్రిటీల్ని ఇంటర్వ్యూలు చేసారు. తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ సెలబ్రిటీల ఇంటర్వ్యూలకే వన్నె తెచ్చిన గ్రేట్ పర్సన్. ఫీలవ్వద్దంటూ ముందే అనుమతి తీసుకుని మరీ ముక్కు సూటి ప్రశ్నలను సంధించడం ఆయన స్టైల్. టీఎన్నార్ ఇంటర్వ్యూ అంటే సదరు సెలబ్రిటీ ముందే మెంటల్ గా ప్రిపేర్ అయ్యే విధంగా తనదైన మార్క్ వేసాడు. అందుకే యూ ట్యూబ్ లో ఎంత మంది సెలబ్రిటీ ఇంటర్వ్యూయర్లు ఉన్నా టీఎన్ ఆర్ కు ప్రత్యేకమైన స్థానం.. గుర్తింపు లభించాయి. ఫిల్మ్ మీడియాలోనూ అనుభవజ్ఞుడిగా గౌరవం అందుకున్నారు.
అయితే ఆయన హఠాన్మరణం యావత్ ఇండస్ట్రీనే కలచి వేసింది. కరోనా మహమ్మారితో పోరాడి ఓడిపోయారు. అయితే టీఎన్ ఆర్ మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రకరకాల డిపార్ట్ మెంట్లలో పనిచేసి చివరికి ఇంటర్వ్యూయర్ గా స్థిరపడిన సంగతి తెలిసిందే. అయితే టీఎన్ ఆర్ ల్యాండ్ మార్క్ 200వ ఇంటర్వ్యూ మెగాస్టార్ చిరంజీవితో చేయాలని ఎప్పటి నుంచో కలలు కనేవారని...ఆ అవకాశం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని టీ.ఎన్.ఆర్ సతీమణి జ్యోతి తెలిపారు.
ఎంతో మంది స్టార్లను ఇంటర్వ్యూ చేసాను. కానీ మెగాస్టార్ ని మాత్రం కలిసే అవకాశం రాలేదని...ఆ అవకాశం ఎలాగైనా 200వ ఇంటర్వ్యూతోకి వస్తుందని టీఎన్ ఆర్ అనే వారని ఆమె తెలిపారు. మెగాభిమానిగా పరిశ్రమకు వచ్చిన ఆయన కోరిక చివరికి తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీటిపర్యంతమయ్యారు. టీఎన్నార్ మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి సహా పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ లక్ష రూపాయలు తక్షణ సహాయం అందించారు. టీఎన్నార్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని చిరంజీవి మాటిచ్చిన సంగతి తెలిసిందే.