దేవర.. కత్తిలాంటి ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వస్తోంది.

Update: 2024-09-16 11:17 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో తారక్ చేశాడు. తండ్రి పాత్ర పేరునే సినిమాకి పెట్టారు. దేవర క్యారెక్టర్ చాలా వైలెంట్ గా ఉంటుందంట.

ధైర్యంతో రాక్షసులుగా బిహేవ్ చేసేవారికి భయాన్ని పరిచయం చేసే వ్యక్తిగా ఎన్టీఆర్ పాత్ర ఉండబోతోందని ఇప్పటికే ట్రైలర్ తో రివీల్ చేశారు. ఇదిలా ఉంటే ఈ క్యారెక్టర్ కి సంబందించిన స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక ఫోటోలో బ్లాక్ షర్టు, లుంగీతో ఉన్న ఎన్టీఆర్ పొడవైన కత్తి పట్టుకొని చూస్తున్నాడు. మరో స్టిల్ లో తారక్ ఒక నాయకుడిలా నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ రెండు లుక్స్ కూడా ఎన్టీఆర్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ లైన్ కి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యేలా ఈ లుక్ ఉందనే మాట ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే దేవర లుక్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ కటౌట్స్ ఏర్పాటు చేయడానికి ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు బయటకొచ్చిన లుక్స్ కూడా కటౌట్ కి సరిపోయే రేంజ్ ఎలివేషన్ తో ఉందనే మాట వినిపిస్తోంది. బ్లాక్ కలర్ కాస్ట్యూమ్ ని ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కి సింబాలిక్ గా కొరటాల శివ రిప్రజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే దేవర సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా సందీప్ రెడ్డి వంగా దేవర టీమ్ మొత్తాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో చాలా ఇంటరెస్టింగ్ విషయాలని తారక్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ తో పాటు కొరటాల శివ పంచుకున్నారు. మరిన్ని స్పెషల్ ఇంటర్వ్యూలని కూడా టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దేవర మూవీ కంటెంట్ ని స్ట్రాంగ్ గా పబ్లిక్ లోకి తీసుకొని వెళ్ళడానికి అన్ని రకాల ప్రమోషనల్ స్ట్రాటజీస్ ని కూడా మేకర్స్ ఫాలో అవుతున్నారంట. ఈ నెల 22న దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. ఈ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే ప్రీరిలీజ్ ట్రైలర్ కూడా దేవర చిత్రం నుంచి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News