టాలీవుడ్ హీరోయిన్ అయిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట హరియాణాలో పేరున్న పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకున్న మెహ్రీన్.. ఇక పెళ్లే తరువాయి అనుకుంటుండగా.. ఉన్నట్లుండి ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. ఇకపై భవ్యతో పాటు అతడి సన్నిహితులు, కుటుంబ సభ్యులెవరితోనూ తనకు సంబంధం లేదని ప్రకటించడమే కాదు.. సోషల్ మీడియాలో తన నిశ్చితార్థం, భవ్యతో ముడిపడ్డ ఫొటోలు, పోస్టులు అన్నీ డెలీట్ చేసేసింది మెహ్రీన్. ఇదిలా ఉంటే.. మెహ్రీన్ ఈ మధ్య మరీ సన్నబడి లుక్ పూర్తిగా మార్చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు కానీ.. ఇది అందరికీ సూట్ కాదు. కొందరు హీరోయిన్లు కొంచెం బొద్దుగా ఉంటేనే బాగుంటారు. మెహ్రీన్ ఆ కోవకు చెందిన అమ్మాయే. కృష్ణగాడి వీర ప్రేమగాథలో తన బబ్లీ లుక్స్ చూసే చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాల్లోనూ అదే లుక్ మెయింటైన్ చేసి అభిమానులను ఆకట్టుకుందామె. ఐతే గత ఏడాది నుంచి మెహ్రీన్ సన్నబడే ప్రయత్నం చేస్తోంది. అలా సన్నబడుతున్నపుడే నిశ్చితార్థం కూడా చేసుకోవడంతో పెళ్లి కోసం స్లిమ్ లుక్‌లోకి మారుతుందేమో అనుకున్నారు. కానీ గత కొన్ని నెలల్లో మరీ చిక్కిపోయి.. ఇప్పుడు ఇబ్బందికరమైన లుక్‌లోకి మారిందామె. ఈ మధ్య వ్యాక్సిన్ వేసుకుంటున్నపుడు మెహ్రీన్ లుక్ చూసి పేషెంట్లా తయారైందేంటి అని నెటిజన్లు కామెంట్ చేశారు. తాజాగా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆమె ఫొటోలు చూస్తే ఆమెకేమైనా ప్రాబ్లెం ఉండి ఇలా చిక్కిపోతోందా అని సందేహాలు కలుగుతున్నాయి. బబ్లీ లుక్స్ చూసి మెహ్రీన్ ఫ్యాన్స్ అయిన వాళ్లంతా కొత్త లుక్ చూసి పెదవి విరుస్తున్నారు.